ఈ 11 ఉద్యోగాలు చేసే మగాళ్లంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం సర్వేలో బయటపడ్డ ఆసక్తికర నిజాలు

Loading...
అమ్మాయిలను ఆకట్టుకోవాలంటే అందంగా ఉండడం ఒక్కటే సరిపోదట. మగవారు చేసే జాబ్ కూడా లేడీస్ కు నచ్చాలంట. ఒక్కో అమ్మాయికి ఒక్కో ప్రొఫెషనల్ వర్క్ చేసేవారంటే ఇష్టపడతారని మరో అధ్యయన కనిపెట్టంది. కొందరు ఫొటోగ్రాఫర్స్ కు ఫ్లాట్ అవుతారట.. మరికొందరు బార్ అటెండర్స్ అంటే ఇష్టపడతారట. రచయితలను, డాక్టర్లను ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువగానే ఉంటారట. వంటవండేవాళ్లను ఆడవారూ బాగానే లైక్ చేస్తారు. హీరోలు, మ్యుజీషియన్స్.. ఇలా మొత్తానికి ఓ పదకొండు ప్రొఫెషన్స్ లో ఉన్నవారిని గర్ల్స్ బాగా లైక్ చేస్తారట. వారికి ఇంప్రెస్ అవుతారంట. ఆ రంగాలు ఏమిటి.. వాళ్లు అందులో పని చేసే వారిని ఇష్టపడడానికి కారణాలు ఏమిటో మీరూ చదవండి.
1. రచయిత: ఒక రచయిత ఎవరినైనా ప్రేమిస్తే అతను తన జీవితాంతం ఆమెతోనే కలిసి ఉంటాడని కొందరు అమ్మాయిల అభిప్రాయం. అలాగే రైటర్స్ ప్రతి ఒక్కరి మనస్సును కూడా బాగా అర్థం చేసుకుంటారని గర్ల్స్ భావిస్తారట. బాధలో ఉన్న సందర్భంలో మనం చెప్పలేని ఎన్నో విషయాలను వారు స్వయంగా అర్థం చేసుకుని ఓదార్పు ఇస్తారని చాలామంది ఆడవారు అనుకుంటారట.
2.ఫొటోగ్రాఫర్: ఫొటోలు దిగడమంటే కొందరు అమ్మాయిలకు పిచ్చి. తమ అందాన్ని ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూ, తమను డిఫరెంట్ స్టైల్స్ లో ఫొటోలు తీసే మగవారంటే కొందరు పడిచస్తారట. ఇలాంటివారు ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్ లో ఉండేవారిని బాగా ఇష్టపడతారట.
3.చెఫ్: ప్రతి మహిళకు కూడా బాగా వండిపెట్టే మగవారంటే భలే ఇష్టమంట. అందుకే కొందరు అమ్మాయిలు చెఫ్ ప్రొఫెషనల్ లో ఉన్న జెంట్స్ ను ఇష్టపడుతుంటారట. తమ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు.. తమకు రుచికరమైన వంటలు వండిపెడతాడని వారు భావిస్తారట.
4.మిలటరీ మ్యాన్: ఆర్మీలో పని చేసే వారు ఫిట్ గా ఉండమే కాకుండా చాలా అందంగా ఉంటారని అమ్మాయిుల భావిస్తారట. అలాగే మిలటరీలో పని చేసేవాళ్లు నిజాయితీగా ఉంటారని మహిళల నమ్మకం. అందుకే ఆ రంగంలో పని చేసే వారిని కూడా అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారట.
5.ఫైలట్: ఫైలట్ జాబ్ ఒక రెస్పాన్సిబిలిటీ వర్క్ అని అమ్మాయిల అభిప్రాయం. వారు చూడడానికి మంచి డ్రెస్ లో అందంగా ఉంటారని విమెన్స్ భావిస్తారు. అలాగే వారు మంచి ఎడ్యుకేటేడ్ అయి ఉండడం మంచి నాలెడ్జ్ కలగి ఉండడం వల్ల అమ్మాయిలకు ఆ రంగంలోని వారంటే బాగా ఇష్టమట.
6.డాక్టర్: మెడికల్ ప్రొఫెషన్ అనేది మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ అనే విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల చాలామంది ఆడవారికి ఈ రంగంలో పని చేసేవారంటే చాలా ఇష్టం. ప్రజలకు సేవ చేయడంతో పాటు మంచి తెలివి కలిగి ఉండడం అలాగే డిసిప్లెయిన్ డ్ గా ఉండడం వల్ల డాక్టర్లంటే ఆడవారికి చాలా ఇష్టం.
7. ఎంటర్ ప్రెన్యూర్: ప్రస్తుత కాలంలో ఈ ప్రొఫెషన్ కూడా మంచి ఆదరణ పొందడంతో ఇందులో పని చేసే వారంటే కూడా అమ్మాయిలకు చాలా ఇష్టం. అందువల్ల చాలామంది ఆడవారు ఈ ప్రొఫెషనల్ లో వర్క్ చేసేవారికి ఎక్కువ ప్రియార్టీ ఇస్తుంటారట.
8. బార్ అటెండర్: ఏంటీ.. అమ్మాయిలకు ఈ ప్రొఫెషన్ లో ఉండే వాళ్లు కూడా నచ్చుతారా అని ఆశ్చర్యపోకండి. అందరు ఆడవాళ్లకు ఈ జాబ్ చేసే వాళ్లు నచ్చకపోవొచ్చు కానీ కొందరికి ఈ వర్క్ చేసేవారంటే చాలా ఇష్టమట.
9. కోడర్స్ / హ్యాకర్స్ / సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్: ప్రస్తుతం ఉన్న రంగాల్లో ఐటీ ఈజ్ ద బెస్ట్ అని కొందరి ఆడవాళ్ల అభిప్రాయం. అందువల్ల చాలామంది అమ్మాయిలకు ఇంజనీర్స్ , హ్యాకర్స్ అంటే ఇష్టమట. హ్యాకర్స్ ఏదైనా సమచారాన్ని హ్యాక్ చేసినట్లే గర్ల్స్ గుండెల్లో చోటును కూడా దోచెస్తారట.
10. మ్యుజిషియన్: రాక్ స్టార్ట్స్ అంటే ప్రతి అమ్మాయికి భలే ఇష్టం. అలాంటి వారితో డేటింగ్ చేయడాన్ని ఆడవారు బాగా ఇష్టపడతారట. బాధలో ఉన్న సమయంలోనూ మ్యుజిషియన్స్ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపగలిగే సత్తా కలగి ఉంటారు. అందువల్లే మహిళలు ఇష్టపడే వారిలో మ్యుజిషియన్స్ కూడా మంచి స్థానం ఉంది.
11. యాక్టర్: సినిమా రంగం అంటే ప్రతి ఒక్కరికీ చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. ఇక యాక్టర్స్ కోసం లైఫ్ ను డెడికేట్ చేయాలనుకునే మహిళలు కూడా ఎక్కువే. గ్లామర్ ప్రపంచంలో రారాజులా వెలిగే తారలంటే ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు చెప్పండి.. అందుకే ఆ రంగంలోని వారు మహిళలను ఈజీగా ఇంప్రెస్ చేస్తారు.
Loading...

Popular Posts