మా అమ్మల్ని, అక్కల్ని, ఇంట్లో అందర్నీ సిగ్గులేకుండా అలా చూస్తాం అంటున్న కొందరు YouTube & Websites వాళ్ళు

గత కొద్దీ నెలలుగా ప్రజలను ఆకర్షించడానికి వికృతమైన టైటిల్స్ తో హింసిస్తున్న కొన్ని ఛానళ్లపై, అలాగే వెబ్ సైట్ ల పై చర్చ జరుగుతోంది. దీని పై మా అసోసియేషన్ వారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే, ఆ హెడ్డింగ్ లు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాయో తెలియచేస్తూ, ప్రముఖ సినిమా రైటర్ లక్ష్మీ భూపాల గారు ఒక పోస్ట్ చేశారు .. ఆ పోస్ట్ ఎలా ఉంది అంటే … 

హెడ్డింగ్ 1 - “రాత్రుళ్ళు కిందవి చూసుకుని పీక్కుని లెక్కపెట్టుకుంటున్న కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు” లోపల వార్త : పాపం కొందరు YouTube ఛానెల్స్ వాళ్ళ కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదు.. క్రింద చాలామంది రాసే నెగటివ్ కామెంట్స్ ని రోజూ పీక్కుంటూ ఉండడం పెద్ద పనైపోయింది అని, Dislikes ని లెక్కపెట్టుకుంటూ క్రింద పడి దొర్లి దొర్లి ఏడుస్తూ ఉన్నారు.. 

హెడ్డింగ్ 2 - “మా అమ్మల్ని, అక్కల్ని, ఇంట్లో అందర్నీ సిగ్గులేకుండా అలా చూస్తాం అంటున్న కొందరు YouTube & Websites వాళ్ళు” లోపల వార్త : మాకు నచ్చకపోతే, అబద్దాలు పెట్టి, సొల్లు కబుర్లతో పరువు తియ్యడానికి మా ఇంట్లో ఆడవాళ్ళని, మగవాళ్ళని కూడా క్షమించం..పాపులర్ అవ్వడానికి సిగ్గులేకుండా ఎంతటి నీచానికైనా వెనకాడం అంటున్న కొందరు YouTube & websites వాళ్ళు..వ్యూస్ పెంచుకోవడం మాత్రమే తమ లక్ష్యం అని అందుకోసం ఎంత కిందకైనా దిగజారుతాం అని, ఇదే సమన్యాయం అంటున్నారు వాళ్ళు.. 

హెడ్డింగ్ 3 - ” మా భార్యలు అతనితో అలా అక్కడికి వెళ్లినా పర్వాలేదు అంటున్న కొందరు YouTube & Websites వాళ్ళు” లోపల వార్త : మా భార్యలు వారి తండ్రితో కానీ, అన్నలతో కానీ సినిమాలకు, యాత్రలకు వెళ్తే, మాకేమీ పర్వాలేదు..మేము హోటల్ ఫుడ్ తో బతికేస్తాం అంటున్న కొందరు త్యాగమూర్తులైన YouTube & Websites వాళ్ళు.. 

అసలు వార్తలకంటే హెడ్డింగ్స్ బాగున్నాయి కదా!! ఈ పోస్ట్ పెట్టేముందు నేను నరకయాతన పడ్డాను.. వ్యక్తిగతంగా నాకు ఏమాత్రం ఇష్టంలేని, భరించరాని భాషను వాడాల్సివచ్చింది.. అందరిలాగే ఈ వెధవలను తిట్టడానికి స్త్రీ మూర్తులను అడ్డం పెట్టుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను.. దయచేసి క్షమించండి అమ్మా.. ఇది ఎందుకు పెట్టానో మళ్లీ మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా!.. 

సంస్కారం, సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, చీము, నెత్తురు లేని కొందరు క్రాస్ బ్రీడ్ జంతుమానవులు, పాపులర్ అవ్వడం కోసం చేస్తున్న ఆరాచకపు హెడ్డింగులు చూసి కడుపు రగిలిపోతుంది.. వారికి సాష్టాంగ ప్రణామం చేస్తూ నాదొక్కటే విన్నపం : కుదిరితే మారండి లేదా కొంచెం కూడా ఆలోచించకుండా చచ్చిపోండి.. మీవల్ల దేశానికి, మీ కుటుంబానికి కూడా ఏమాత్రం ఉపయోగం లేదు… 

ఇట్లు - మిమ్మల్ని నేరుగా చంపితే నేరం అని ఆగిపోతూ, క్షమించడానికి కూడా మీరు అర్హులు కాదని భావిస్తూ… లక్ష్మీ భూపాల (అలా మొదలయింది , నేనే రాజు నేనే మంత్రి సినిమాకు రచయితగా పని చేసిన లక్ష్మీ భూపాల్ గారి పోస్ట్ నుండి సంగ్రహించబడినది.)
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)