గాలి కాలుష్యం వల్ల మన ఊపిరి తిత్తులకి చాలా హాని కలుగుతుంది. వాటిని శుభ్రం చేసుకునే విధానం మీ కోసం

గాలి కాలుష్యం వలన మన ఆరోగ్యానికి ప్రమాదకరం అని అందరికీ తెలుసు. దీనివల్ల ఒకదానికి ఒక అనారోగ్య సమస్య ఎదురవుతూ ఉంటుంది. కానీ.. ఏ మాత్రం కేర్ తీసుకోరు.
గాలి కాలుష్యం కంట్రోల్ చేయడం ఎవరి తరమూ కాదు. ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. గాలి కాలుష్యం వల్ల అలసట, దగ్గు, క్షయ, లంగ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 
శారీరక ఆరోగ్యంతో పాటు, గాలి కాలుష్యం వల్ల సైకలాజికల్ గా కూడా సమస్యలు ఎదురవుతాయి. గాలి కాలుష్యం వల్ల వాళ్లకున్న డైలీ యాక్టివిటీస్ ని కూడా మిస్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు రన్నింగ్, ఎక్సర్ సైజ్ వంటి రకరకాల యాక్టివిటీస్ కి దూరంగా ఉండిపోతారు. దీనివల్ల రెస్పిరేటరీ ఫంక్షన్ తగ్గిపోతుంది. గాలి కాలుష్యం వల్ల ప్లాక్, టాక్సిన్స్ రెస్పరేటరీ ట్రాక్స్ ని బ్లాక్ చేస్తాయి. దీనివల్ల లంగ్ క్యాన్సర్, శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లంగ్స్ ని డెటాక్స్ చేయడం చాలా అవసరం. మలినాలను న్యాచురల్ పద్ధతిలో బయటకు పంపవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:-
తాజా అల్లం తురుము కొద్దిగా
2 టేబుల్ స్పూన్ల పసుపు
కొన్ని వెల్లుల్లి రెబ్బలు
2 టేబుల్ స్పూన్ల పంచదార
తయారు చేసే విధానం :-
కొన్ని నీళ్లు తీసుకుని.. బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో.. పైన చెప్పిన పదార్థాలన్నీ వేయాలి ఆ నీటిని ఇప్పుడు ఒక గ్లాస్ జార్ లోకి వడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉదయం, సాయంత్రం 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ డ్రింక్ ని కనీసం 2 నెలలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

అల్లం, వెల్లుల్లి, పసుపు ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలను ఎఫెక్టివ్ గా తరిమేయగలవు. అలాగే కొన్ని రోజుల్లోనే… టాక్సిన్స్ ని బయటకు పంపి.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు దగ్గు, ఇతర శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)