శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్‌ కొలస్ట్రాల్‌ను బయటకు పంపే ఆహార పదార్ధాలు

బరువు తగ్గడంలో క్రమం తప్పని వ్యాయామంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడాప్రముఖ పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. కొన్ని ఆహార పదార్ధాలు కొవ్వును ఉత్పత్తి చేసినా.. అది మంచికొవ్వే (హైడెన్సిటీ లిపో ప్రొటీన్‌ కొలసా్ట్రల్‌) కాబట్టి వాటితో ఇబ్బంది ఉండదు.. మరి కొన్ని ఆహార పదార్ధాలు బ్యాడ్‌ కొలసా్ట్రల్‌ను తగ్గిస్తాయి. అవేంటో చూద్దాం.

సోయాబీన్స్‌: సోయాబీన్స్‌ను ఆహారంలో చేర్చుకుంటే దీని ద్వారా శరీరానికి ప్రొటీన్స్‌ ఎక్కువగా లభిస్తాయి. అలాగే దీనిలో ఉండే ఫైబర్‌ ఎక్కువ ఆహారాన్ని తీసుకోనివ్వదు. ఇక కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సోయాబీన్స్‌ గణనీయమైన పాత్ర పోషిస్తాయి.

ఓట్స్: ఓట్‌ మీల్‌లో చాలా ఎక్కువగా ఫైబర్‌ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండిందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే ఇది శరీరంలోకి చేరే బాడ్‌ కొలస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను అదుపులో ఉంచుతుంది. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా రాత్రి భోజనంగా తీసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది.

ఫలాలు: అన్ని రకాల ఫలాలూ ఆరోగ్యానికి మేలు చేసేవే. కృత్రిమంగా మగ్గబెట్టినవి కాకుండా సహజంగా పండిన ఏ పండైనా మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. జంక్‌ఫుడ్‌ను దూరం పెట్టి రోజూ యాపిల్‌, జామ, బొప్పాయి, దానిమ్మ వంటి ఫలాలు తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం.

టమోటా: టామోటాలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటితోపాటు టమోటాలో ఉండే లైకోపిన్‌ అనే కెరటనాయిడ్‌ రసాయనం శరీరంలో ఉండే బ్యాడ్‌ కొలస్ట్రాల్‌ను నియంత్రిస్తుందట.

నీరు:
ఇక బరువును తగ్గించడంలో మంచినీరు కూడా కీలకపాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం ఐదు నుంచి ఎనిమిది లీటర్ల మంచి నీరు తాగితే ఊబకాయం దరిచేరదట. ఇది శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడంతోపాటు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)