ఈ రెండు పనులు చేయండి చాలు జీవితంలో ఈజీగా సక్సెస్ అవ్వుతారు రిజ‌ల్ట్ మీకే తెలుస్తుంది

లేదు, ఇప్పుడు కాదు. త‌రువాత ఆలోచిద్దాం. త‌రువాత చేద్దాంలే. ఏమో చెప్ప‌లేం. రేపు చూద్దాం. త‌రువాత చేయ‌వ‌చ్చు క‌దా. వ‌చ్చే వారంలో అయితే బెట‌ర్‌. అస‌లు వ‌ద్దులే. ఉహు కాదు.. వీలైన‌ప్పుడు చేద్దాం… ఇవీ… ఎవ‌రైనా ఏదైనా పనిచేయాల‌నుకున్న‌ప్పుడు వారి మ‌న‌స్సులో ఆలోచించే మాట‌లు. 

ఏదైనా ప‌ని అనుకుంటే చాలా మంది నిజంగా దాన్ని చేయ‌రు. లేదా చేసేందుకు బ‌ద్ద‌కం వ‌హిస్తారు. త‌రువాత చేద్దాంలే, ఇప్పుడు ఎందుకు, రేపు చూద్దాం, త‌రువాత ఎప్పుడైనా చేద్దాం… అన్న ధోర‌ణిలోనే ఎవ‌రి ఆలోచ‌న‌లు అయినా సాగుతాయి. అయితే నిజానికి అలా చేయ‌కూడ‌దు. మ‌రి ఇలాంటి ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే, అనుకున్న ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేయాలంటే… అందుకు ఏదీ మార్గం..? అంటే… ఉంది..!
ఇన్‌స్టాగ్రాం సీఈవో, కో ఫౌండ‌ర్ కెవిన్ సిస్ట్రోమ్ పైన చెప్పిన విష‌యానికి సంబంధించి మ‌న‌కు రెండు టిప్స్ ఇచ్చారు. ఎవ‌రైనా ఏదైనా ప‌ని చేయాల‌నుకుని స‌రిగ్గా పైన చెప్పిన‌ట్టుగానే ఆలోచిస్తుంటే వారికి ఇప్పుడు చెప్ప‌బోయే రెండు టిప్స్ ప‌నికొస్తాయి. అవేమిటంటే…

1. ఎవ‌రైనా ఏదైనా ప‌నిచేయాల‌నుకుంటే దాన్ని వాయిదా వేయ‌కండి. ఆ ప‌నికి ఎంత టైమ్ ప‌ట్టినా స‌రే, దాన్ని చేసేందుకే ముందుకు వెళ్లండి. అయితే వెంట‌నే చేయబుద్ది కావ‌డం లేదు, మ‌రి ఏం చేయాలి..? అని అనే వారు.. ఆ ప‌నిని మొదలు పెట్టండి. కానీ పూర్తిగా చేయ‌కండి. కేవ‌లం 5 నిమిషాల పాటు ఆ ప‌ని చేయండి. అంతే.. ఆ ప‌ని మొత్తం పూర్తి చేసేందుకు కావ‌ల్సిన ఉత్సాహం మీకు వ‌స్తుంది. ఇక అంతే.. అంత‌కు ముందు మీరు త‌రువాత చేద్దాంలే అనుకున్న పనిని కూడా వెంట‌నే పూర్తి చేస్తారు. ఇది ఎవ‌రైనా స‌క్సెస్ కావాల‌నుకుంటే పాటించాల్సిన మొద‌టి టిప్‌.

2. ఇక రెండో టిప్ ఏమిటంటే… నిత్యం గంట పాటు వ్యాయామం. అవును, అదే. నిత్యం బిజీ బిజీ లైఫ్ లో, కాంక్రీట్ జంగిల్‌లో గ‌డిపే వారు, కచ్చితంగా రోజూ 1 గంట‌ల వ్యాయామానికి ఎట్టి పరిస్థితిలోనూ స‌మ‌యం కేటాయించాలి. అలా చేస్తే శారీర‌కంగానే కాదు, మాన‌సికంగా కూడా దృఢంగా ఉండ‌వ‌చ్చు. అది ఏ ప‌నినైనా చేసేందుకు కావ‌ల్సిన ఆలోచ‌నా శ‌క్తిని, సామ‌ర్థ్యాన్ని ఇస్తుంది.

కాబ‌ట్టి ఎవరైనా లైఫ్ లో స‌క్సెస్ కోసం చూస్తుంటే ఈ రెండు ప‌నుల‌ను పాటించి చూడండి. రిజ‌ల్ట్ మీకే తెలుస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)