వీటిని రోజూ తింటే మోకాళ్లు, పాదాలు, తుంటి, మోచేయి, భుజాలు మొత్తం కీళ్ల నొప్పులు మాయం

కీళ్లనొప్పులు అనేవి సాధారణంగా వృద్ధాప్యంలో ఎవరికైనా వస్తాయి. మోకాళ్లు, పాదాలు, తుంటి, మోచేయి, భుజాలు తదితర భాగాల్లో ఉండే కీళ్లు నొప్పులకు గురవుతాయి. అయితే నేటి తరుణంలో యుక్త వయస్సులో ఉన్నవారిని కూడా కీళ్ల నొప్పులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కానీ అందుకు బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే కింద చెప్పిన ఆహార పదార్థాలను తింటే దాంతో కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. అరటి పండు - అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఇక వీటిలో ఉండే మెగ్నిషియం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల మధ్యలో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు కూడా అరటిపండ్లు తినడం వల్ల తగ్గుతాయి.
2. చేపలు - చేపల్లో ఒమెగా ౩ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను పోగొడతాయి. కీళ్లను దృఢంగా చేస్తాయి. కనుక చేపలను వారంలో కనీసం ౩ సార్లు అయినా తింటే చాలు, కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
3. గ్రీన్‌ టీ - గ్రీన్‌టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉండడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఎముకలు విరగకుండా చూసే, ఎముకల సాంద్రతను పెంచే గుణాలు గ్రీన్‌ టీలో ఉన్నాయి.
4. నారింజ - నారింజ పండ్లను రోజూ తింటున్నా కీళ్ల నొప్పుల సమస్యను పోగొట్టుకోవచ్చు. వీటిల్లో ఉండే విటమిన్‌ సి ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి.
5. పీనట్‌ బటర్‌ - ఇది మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. దీంట్లో విటమిన్‌ బి౩ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలకు ఎంతగానో అవసరం. ఈ క్రమంలోనే రోజూ పీనట్‌ బటర్‌ తింటే ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
6. రాగులు, జొన్నలు, సజ్జలు - వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజూ వీటిని ఏదో ఒక రూపంలో తినాలి. అలా తింటే శరీరానికి కావల్సిన కీలక పోషకాలు లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
7. రొయ్యలు - పచ్చిరొయ్యలను తినాలి. వీటిని కూరగా చేసుకుని తినవచ్చు. వీటిల్లో విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను పోగొడుతుంది.
8. పసుపు - ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్‌ గుణాలు మెండుగా ఉన్నాయి. కనుక పసుపు నిత్యం ఒక గ్లాస్‌ పాలలో అర టీస్పూన్‌ మోతాదులో వేసుకుని తాగినా కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
9. పైనాపిల్‌ - రోజూ పైనాపిల్‌ను తిన్నా కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు. వీటిల్లో ఉండే విటమిన్‌ సి శరీరానికి ఎంతగానో అవసరం. ఎముకల దృఢత్వానికి పనికొస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)