చేతికి రాగి కడియం పెట్టుకుంటే ఎన్నో మరెన్నో ఆరోగ్యసమస్యలు పోతాయి ఇది ఒక అద్భుతమైన వరం అని చెప్పాలి

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలున్నాయి. కేవలం రాగి పాత్రల్లోని నీరు తాగడం మాత్రమే కాదు దానితో తయారు చేసిన ఆభరణాలతోనూ అనేక లాభాలున్నాయి. బంగారం, వెండి అభరణాల కంటే రాగితో తయారు చేసిన వాటిని ధరిస్తే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. రాగితో తయారు చేసిన ఉంగరం, చైన్, బ్రాస్లెట్‌‌ను ధరిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ ప్రభావం కూడా తగ్గుతుంది. రాగి ఆభరణాలు సూర్య కిరణాల ద్వారా విడుదలయ్యే అనుకూల శక్తి జనకాలను నేరుగా శరీరానికి అందజేస్తాయి. వీటిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఎలాంటి ఆందోళనలు దరిచేరవు. ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరించి శరీరాన్ని చల్లబరిచే గుణాలు రాగిలో ఉంటాయి. దీంతో జ్వరం, బీపీ లాంటి వ్యాధులు దరిచేరవు.

గుండె కొట్టుకోవడమనే సహజ ప్రక్రియ సాధారణ రేటులో జరుగుతుంది. శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే గ్యాస్, అసిడిటీ లాంటివి కూడా అదుపులో ఉంటాయి. చర్మం కూడా మృదువుగా, కాంతివంతగా మారుతుంది.

చర్మం, గోళ్లు, వెంట్రుకలు సమస్యలు తగ్గుతాయి. తలనొప్పితో బాధపడేవారు రాగి ఆభరణాలను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. రాగి అభరణాల్లో రాగి అణువులు ఎప్పటికప్పడు శరీరంలోకి ప్రవేశిండం వల్ల మనకు అవసరమైన ఇతర ఖనిజ లవణాలు సక్రమంగా అందుతాయి.

Popular Posts

Latest Posts