ప్రతిరోజు ఐదు ద్రాక్షలు తింటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు

ప్రతిరోజు ఐదు ద్రాక్షలు తింటే ఆరోగ్యానికి ఏ ఢోకా లేదంటున్నారు వైద్య నిపుణులు. తక్షణ శక్తిని ఇవ్వడంలో ఎండుద్రాక్ష ముందుంటుంది. ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సహజసిద్ధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎండు ద్రాక్షలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపడటానికి సాయపడతాయి.

పిల్లల శరీరానికి ఎండుద్రాక్ష సహజమైన వేడిని అందిస్తుంది. దీని వల్ల పిల్లలు పక్క తడపకుండా ఉంటారు. ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని కలుగజేస్తాయి. రాత్రి పూట ఎండుద్రాక్షను నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇంకా దీనిలో ఉండే ఫైబర్ వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలను పోగొడుతుంది. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు, పది ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలోని పొటాషియం నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.


ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో 10 నుంచి 15 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. నాలుగైదు గంటల తర్వాత ఎండు ద్రాక్షను నమలాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అనీమియా నుంచి బయటపడొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కాన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి.
ఎండు ద్రాక్షలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి పళ్లను, చిగుళ్లను బలంగా చేస్తాయి. దీనిలోని కాల్షియం వల్ల కీళ్లనొప్పులను అరికడుతుంది. ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకుంటే శరీరంలో పేరుకు పోయిన మలినాలను బయ టకు పోతాయి. కాలేయ సంబంధ సమస్యలను నివారిస్తుంది.

Popular Posts

Latest Posts