వీళ్ళను చూస్తే ఎవరైనా అసలు వీళ్లు డాక్టర్లేనా అనుకుంటారు కానీ MBBS., MD అర్హత కలిగిన ఈ మహానుభావులు కేవలం గిరిజనుల కోసం ఫ్రీగా పనిచేస్తున్నారు

Loading...
మహారాష్ట్రలోని షెగావ్ గ్రామానికి చెందిన డాక్టర్ రవీంద్ర కొల్హె , డాక్టర్ స్మితా కొల్హెల నిస్వార్థ సేవా జీవితం అందరికీ ఆదర్శం. ఎమ్ బి బి ఎస్/ ఎమ్ డి పూర్తిచేసి సమాజసేవకు నడుం బిగించారు. ఆ రాష్ట్రంలోని మెల్ఘోట్ గిరిజనులకు గత నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. కేవలం గిరిజనుల శారీరక సమస్యలకోసమే కాకుండా వారిని బహువిధాల తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. విద్యుత్తు, రోడ్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటయ్యేలా పాటుపడ్డారు. తగిన గుర్తింపు లభించని ఈ దంపతుల గూర్చిన అద్భుతమైన విషయాలు…
పత్రికలో వచ్చిన కథనం దారి చూపింది – రవీంద్ర వారి కుటుంబంలోనే మొట్టమొదటి డాక్టర్. నాగపూర్‌లో మెడిసిన్ పూర్తిచేసి తన సొంత గ్రామానికి వచ్చి క్లినిక్ నడుపుతూ డబ్బు సంపాదిస్తాడనుకున్నారంతా, కాని రవీంద్ర చిన్నప్పటినుండే మహాత్మాగాంధీ, వినోభ భావే ల సాహిత్యం చదివి స్ఫూర్తి పొందారు. దాంతో తన చదువు పూర్తికాగానే డబ్బు సంపాదనవైపు కాకుండా, అత్యంత అవసరమైనవారికి సేవలను అందించాలని నిర్ణయించుకున్నారు. తన మనసులోని ప్రశ్నకు ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనంతో సమాధానం దొరికింది డాక్టర్ రవీంద్రకు.’ఒక పేషెంట్‌ను నలుగురు మోసుకెళ్ళడం’ ఫోటో అయితే దాని కింద ‘ 30 కి.మీటర్లు నడవాలని’ రాసి ఉన్నది రవీంద్రను ఆలోచింపజేసింది, అదే మెల్ఘాట్ గ్రామం. రవీంద్ర ఉండే బైరాఘర్ నుండి రోజూ 40 కిలోమీటర్లు నడకతో వెళ్ళాల్సి ఉంటుంది.
బీ బీ సి వారు ప్రసారం చేశారు – అత్యవసరం అయినా కూడా 40 కి.మీ నడవాల్సినంత కుగ్రామంలో వైద్యసేవలందించాలంటే ముఖ్యంగా మూడు నైపుణ్యాలు ఉండాలని తన ప్రొఫెసర్ సూచించారు. అవి 1.సోనోగ్రఫీ అవసరం లేకుండా డెలివరీ చేయడం 2. ఎక్స్ రే అవసరం లేకుండా న్యుమోనియాను గుర్తించడం. 3. డయేరియా పేషెంట్లకు వైద్యం చేయడం. దాంతో రవీంద్ర ఆరునెలపాటు ముంబయిలో శిక్షణ పొంది తిరిగి వెళ్ళారు. తరువాత తనకు అర్ధమయ్యింది ఎమ్ బి బి ఎస్ మాత్రమే సరిపోదని. వెంటనే ఎమ్ డిలో చేరిపోయారు. ఎమ్ డి చేస్తున్నప్పుడు థీసిస్‌కు మెల్ఘాట్ ప్రజలలో ఉన్న పోషకాహార లోపాన్ని సబ్జెక్ట్‌గా తీసుకున్నారు. బీ బీ సి రేడియో వారు ఈ గ్రామం గూర్చి ప్రసారం చేశారు. దాంతో మెల్ఘాట్ గ్రామం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది.

వివాహ ఖర్చు ఐదు రూపాయలు – సేవాగుణంగల మహిళను తన జీవితభాగస్వామి చేసుకోవాలనుకున్న రవీంద్రకు నాగపూర్‌కు చెందిన డాక్టర్ స్మిత తోడయ్యారు. స్మితకు రవీంద్ర చెప్పిన నియమాలు ఆసక్తికరంగా అనిపొచాయి అందులో 1.నెలకు 400 రూపాయల ఆదాయంతో బ్రతకాలి(పేషెంట్ నుండి ఒక్క రూపాయి ఫీజు కింద వసూలు చేసేవారు). 2. వివాహ ఖర్చు కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉండాలి(కోర్టు ఫీజు). 3. పేదలకు సాయం చేయడానికి అవసరమైతే అడుక్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వీటన్నిటికీ ఒప్పుకున్న స్మిత కూడా మెల్ఘాట్‌లోనే ఉండేవారు. డాక్టర్ స్మిత మొదటి ప్రసవం కూడా పట్టుబట్టి అక్కడే చేసుకొవడంతో గ్రామ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. పుట్టిన బిడ్డకు న్యుమోనియా రావడానికి పేదరికం కారణమవుతున్నదన్నది గ్రహించారు. అంతే వారి గమ్యం పేదరిక నిర్మూలన వైపు మార్చుకున్నారు.
ఫంగస్‌కు తట్టుకునే వంగడం- గ్రామస్థుల ఆరోగ్యం కొంతమేర మెరుగవగానే పశువుల, మొక్కల బాగు చూడాలని వారు కోరడంతో డాక్టర్ కొల్హె పంజాబ్ రావ్ కృషి విద్యాపీఠ్‌లో అగ్రికల్చర్ కోర్స్ పూర్తిచేశారు.స్నేహితుడైన వెటర్నరీ డాక్టర్ నుండి జంతువుల అనాటమీ నేర్చుకున్నారు. వ్యవసాయంలో నూతన ప్రయోగాలు చేస్తూ ఫంగస్‌ను తట్టుకొని బ్రతికే విత్తనాలను తయారుచేశారు. కాని పండించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో భార్యాభర్తలిద్దరూ సాగు మొదలుపెట్టారు. దిగుబడి బాగా రావడంతో యువతకు వ్యవసాయంలో మెళకువలు, పర్యావరణ పరిరక్షణ, గవర్నమెంట్ స్కీముల గూర్చి అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. వారి ఆదర్శానికి అనుగుణంగా వారి పెద్ద కుమారుడు రోహిత్ కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చాడు. మహారాష్ట్రలోనే సోయాబీన్ పండించిన మొదటి వ్యక్తిగా రోహిత్ పరిచయమయ్యాడు. ఒక ఐ ఐ టి చదివిన వ్యక్తికి సమానంగా తాను సంపాదిస్తున్నానని చెబుతున్నాడు రోహిత్.
మరిన్ని కార్యక్రమాలు- పిడిఎస్ (ప్రభుత్వ పంపిణీ పథకం)ను ప్రోత్సహించి మెల్ఘాట్‌లో అందరికీ ఆహారం దొరికే విధంగా చర్యలు తీసుకున్నారు, దీంతో ఆ ప్రాంతం ఆత్మహత్యలు లేనిది అయ్యింది. మహారాష్ట్ర మంత్రి వీరి గ్రామాన్ని సందర్శించినప్పుడు వీరు నివసిస్తున్న పెంకుటిల్లును చూసి పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పినప్పుడు డాక్టర్ స్మిత వారి గ్రామంలో రోడ్లను వేయించాలని కోరారు. దీంతో నేడు 70 శాతం మందికి రోడ్డు వసతి అందుబాటులోనికి వచ్చింది. ఒకప్పుడు గ్రామానికి వెళ్ళాలంటే 40 కి.మీ నడవాల్సి వచ్చిన గ్రామానికి నేడు రోడ్లు అభివృద్ధి చెందాయి. విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు 12 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏర్పాటయ్యాయి. సర్జన్ కొరత ఇంకా మిగిలే ఉండడంతో డాక్టర్ రవీంద్ర, స్మిత ల రెండవ కుమారుడు రామ్ దాన్ని పూరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రామ్ అకోలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎమ్ బి బి ఎస్ చదువుతున్నాడు. తానూ నాన్న చూపిన బాటలో నడుస్తానని చెబుతున్నాడు.
Loading...

Popular Posts