చేపలు రొయ్యలు త్వరగా కండపట్టి బరువు పెరగడానికి వాటికీ పెట్టె మేతలో చీప్ లిక్కర్ కలుపుతున్న చేపల చెరువుల యజమానులు

Loading...
చీప్‌ లిక్కర్‌కు అలువాటు పడిన చేపలు... వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. అయితే వీటిని చూడాలంటే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాకు రావాల్సిందే. మద్యపానానికి అలవాటు పడిన రొయ్యలు బాగా కండపట్టి ఉంటున్నాయి. అందుకే చేప, రొయ్య సాగు చేస్తున్న రైతులు కేసుల కొద్దీ చీప్‌ లిక్కరు కొనుగోలు చేస్తున్నారు. వీటికి వేసే దాణా(మేత)లో దీన్ని కలపడం ద్వారా ఆ జీవులు ఆహారాన్ని ఆబగా తినేస్తున్నాయి. దీంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో 50కిలోల దాణా బస్తాకు ఒక ఫుల్‌ బాటిల్‌ వంతున చీప్‌ లిక్కర్‌ కలిపి చెరువుల్లో వేస్తున్నారు. ముందుగా రెండు మూడు కిలోల దాణాలో ఒక పుల్‌ బాటిల్‌ కలిపి బాగా కలియబెడతారు. దాన్ని 50కిలోల బస్తాల్లో మిశ్రమం చేసి చేపలు, రొయ్యలకు ఆహారంగా వేస్తున్నారు.

చెరువులో వేసిన మేతను రొయ్యలు, చేపలు తినడానికి కనీసం 2 గంటల సమయం పడుతుందని రైతులు చెబుతున్నారు. అయితే దాణాలో చీప్‌ లిక్కరు కలపడం మొదలైన తర్వాత కేవలం గంటలోనే తినేస్తున్నాయని, ఇలా పుష్టిగా తినడం ద్వారా రొయ్యలు కండబడుతున్నాయని, కౌంట్‌ తక్కువ రోజుల్లో వస్తోందంటున్నారు. అయితే ఇలా పెంచిన చేపలు, రొయ్యలు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యనిపుణులు.
Loading...

Popular Posts