ఫాస్ట్ ఫుడ్ తో జాగ్రత్త ఫాస్ట్ ఫుడ్ వలన ఒక్కసారి వంట్లో కొవ్వు చేరితే దానిని కరిగించడం అసాధ్యమనే చెప్పాలి

Loading...
మనిషి జీవన విధానంలో రోజు రోజుకు విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఇంట్లో చేసిన ఫుడ్డు తప్పితే.. బయటివి పెద్దగా తినేవారు కాదు. కానీ ప్రస్తుతం పెద్దల నుంచి మొదలుకొని చిన్న పిల్లల వరకు బయట ఆహార పదార్థాలను రుచిచూడడం పరిపాటిగా మారింది. ఫంక్షన్లు, పార్టీలు, వీకెండ్‌లు, సెలవులు ఇలా.. ప్రతి సందర్భంలోనూ బయటి తిండ్లు తినడం ఇటీవలి కాలంలో పెరిగింది. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బయటి తిండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిదీ కల్తీమయంగా మారిన ప్రస్తుత తరుణంలో.. ఆహార విషయాల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రోగాల బారిన పడడం తథ్యం..
ఆదివారం వచ్చిందంటే చాలు ఉద్యోగులు, వ్యాపారులు కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లి ఫాస్ట్‌ఫుడ్ తినడం ఇటీవలి కాలంలో పెరిగింది. ఇక విద్యార్థులు కర్రీల బెడదతో ఫాస్ట్‌ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా ఫాస్ట్‌ఫుడ్ తినడం ఇటీవలి కాలంలో పెరిగింది. రాత్రయితే చాలు ఫాస్ట్‌పుడ్ సెంటర్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. దీనిని అసరాగా చేసుకుంటున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఫుడ్‌లో నాసిరకం డాల్డా, నూనెలు అనారోగ్యానికి గురి చేసే రంగులు, నిల్వచేసిన మాంసం వాడుతున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఇవి తిన్న వారు రోగాల బారిన పడుతున్నారు.

ఫాస్ట్‌ఫుడ్, బేకరి ఐటంలు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. రోడ్ల పక్కన తోపుడు బండ్ల పై ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా అమ్మకాలు కొనసాగుతున్నాయి.  కల్తీనూనెలు, రంగులు కలిపిన ఆహార పదార్థాలు, పాడైన మాంసం వాడుతున్నా చర్యలు లేవు, లైసెన్స్‌లు లేకుండా వ్యాపారాలు చేస్తున్నా.. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లైసెస్స్‌లు లేకున్నా నిర్వాహకులు దర్జాగా కల్తీ ఫాస్ట్‌ఫుడ్ విక్రయిస్తూ ప్రజా ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఫాస్ట్‌ఫుడ్ లో కార్బోహైడ్రేట్‌లు, కొలస్ట్రాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల కుర్ర వయసులోనే ఉబకాయం, అధిక బరువు వంటి సమస్యల బారినపడతారు. అంతేకాదు ఫాస్ట్ ఫుడ్ వలన ఒక్కసారి వంట్లో కొవ్వు చేరితే దానిని కరిగించడం చాలా కష్టం ఒకరకంగా అసాధ్యమనే చెప్పాలి. ఫాస్ట్ ఫుడ్స్ లో కలిపే రసాయనాల వల్ల శ్వాసకోస వాధ్యులు, మలబద్దకం, ఎలర్జీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఫాస్ట్‌ఫుడ్ తినడం వల్ల అతిసార వచ్చే అవకాశం ఎక్కుగా ఉంటుంది. తల్లిదండ్రులు, పిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Loading...

Popular Posts