థాయ్‌లాండ్ మాదిరిగా శబరిమల లైంగిక పర్యాటక కేంద్రంగా మారే ప్రమాదం ఉందంటూ బోర్డు అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

Loading...
అయ్యప్ప గుడిలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు అనుమతినిస్తే శబరిమల అపవిత్రమవుతుందని అన్నారు. శబరిమల దర్శనానికి మహిళలకు అనుమతించడం ఈ ప్రాంతంలో అనైతిక కార్యకలాపాలకు దారితీస్తుందని, థాయ్‌లాండ్ మాదిరిగా శబరిమల లైంగిక పర్యాటక కేంద్రంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. 10 ఏళ్ల‌లోపు 50 ఏళ్లు వయసు దాటిన మహిళలను మాత్రమే శబరిమల అయ్యప్పగుడిలోకి అనుమతిస్తారు. ఆ మధ్య వయసున్న మహిళలను ఆలయంలోకి రానివ్వరు.

ఈ ఆచారం అక్కడ తరతరాలుగా అమలులో ఉంది. ఈ నిషేధం రాజ్యాంగపరంగా చెల్లుతుందా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తామని శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే గోపాలకృష్ణ మాట్లాడుతూ శబరిమలకు మహిళలను అనుమతిస్తే భద్రతాపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయని చెప్పారు. ఒకవేళ కోర్టు అనుమతించినా ఆత్మగౌరవం గల మహిళలెవరూ శబరిమలకు రారని అన్నారు. కాగా, ఆయన వ్యాఖ్యలను కేరళ ప్రభుత్వం ఖండించింది. గోపాలకృష్ణ మూర్ఖంగా మాట్లాడి మహిళలను, యాత్రికులను అవమానిస్తున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కాకంపల్లి సురేంద్రన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళ రుతుక్రమ మైలతో ఉన్నారా లేదా అని పరీక్షించే యంత్రాలను సమకూర్చితే ఆలయంలోకి వారిని రానిస్తామని గోపాలకృష్ణ రెండేళ్ల‌ క్రితం ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యే చేశారు.
Loading...

Popular Posts