వామ్మో మూడేళ్ళ బుడ్డోడు అనకొండతో గేమ్స్‌.. వీడు చిచ్చరపిడుగురా!

Loading...
రెండు మూరల ఎత్తు, మూడేళ్ల వయసు. ఆ పాటికే వాడు వీరుడైపోయాడు! శక్తిమంతమైన అనకొండను ఆటాడించాడు... దానిపైన కూర్చొని జాలీరైడ్‌ చేశాడు! కనీసం కొండచిలువ భోజనంలో పావువంతు కూడా ఉండని బుడతడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది...? మనిషి కనబడటమే కరకరా నలిపేసే జీవి.. వీడితో మాత్రం ఎందుకు ఆటలాడింది...? ఇప్పటికే వైరల్‌ అయిన ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఈ బాలుడి పేరు తుయోంగ్‌(3). ఉండేది వియత్నాంలోని హత్రుంగ్‌ జిల్లా హలాంగ్‌ ప్రాంతం. ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా తుయోంగ్‌ వాళ్ల ఊళ్లోని ఇళ్లులోకి వరద వచ్చిచేరింది. అప్పుడు తుయోంగ్‌ అమ్మానాన్నలు.. కొండచిలువను ఆ నీటిలోకి వదిలారు. అది.. వాళ్ల పెంపుడు కొండచిలువ అన్నమాట!!

కొండచిలువతో తుయోంగ్‌ ఆటాడుకుంటున్న దృశ్యాలను వాళ్ల బంధువొకరు వీడియోతీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అంత పెద్ద పాముపై బుడ్డోడ్డు కూర్చోవడాన్ని నమ్మని కొందరు.. దీన్నొక గ్రాఫిక్‌గా భావించారట! వీడియో వైరల్‌ కావడంతో పలు మీడియా సంస్థలు తుయోంగ్‌ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పలకరిస్తున్నారు. వీడియోని దృశ్యాలన్నీ వాస్తవాలేనని, తుయోంగ్‌కు ఆ కొండచిలువంటే చాలా ఇష్టమని వాళ్ల పెద్దలు చెప్పుకొచ్చారు.. ఆ వీడియో మీరూ చూడండి.
Loading...

Popular Posts