దీన్ని భక్తి అంటారా పిచ్చి అంటారా ? ప్రదక్షిణ చేయటానికి వీలు లేకపోయినా ప్రదక్షిణ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు

బాబోయ్… ఇదెక్కడి ప్రదక్షిణ బాబోయ్ అని హడలెత్తేలా…. ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తయ్యేకొద్దీ మళ్లీ జన్మ ఎత్తినట్టుగా… పొరపాటున పట్టుతప్పితే, కాలు జారితే ఏకంగా ఇక పరలోక ప్రయాణమే… అంతటి అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన ప్రదక్షిణాలు అవి… అంతే… నిన్న ఓ భక్తుడు ఇలాగే జారిపడి ప్రాణాలు కోల్పోయిన వార్త విభ్రాంతిని కలిగించింది… 

ఇది తెలుసుకోవాలంటే మనం తమిళనాడులోని తిరుచ్చికి వెళ్దాం పదండి… అక్కడికి సమీపంలోనే ముసిరిలో ఓ గుడి ఉంది… సంజీవి పెరుమాళ్ కోవెల… 3500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ గుడి… ట్రెక్కింగ్ చేసినట్టే గుడికి వెళ్లడమంటే… అయితే తమిళనాట గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనే భక్తి సంస్కృతి బాగా ఎక్కువ… మన ప్రదక్షిణల్లాగా ఏదో గర్భగుడి చుట్టూ కాదు, గుడి చుట్టూ, గుడి కట్టిన గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు… సో, ఇక్కడ కూడా గుడి ప్రదక్షిణలు చేస్తుంటారు… దాన్ని గిరివాలం అంటారు… అయితే అత్యంత ప్రమాదకర స్థితిలో… ఎందుకంటే… నిజానికి ఆ గుడి చుట్టూ నడవటానికి ఏమీ ఉండదు… పెద్ద గుట్ట అంచులో కట్టిన గుడి అది… మరి ప్రదక్షిణ…?
చూశారు కదా ఈ గుడి ఎక్కడ కట్టారో… అయితే ప్రదక్షిణ చేయటానికి భక్తులు ఆ అంచుల వెంట, ఆ రాతి ప్రహారీ వెంట, చేత్తో జాగ్రత్తగా రాళ్లను పట్టుకుంటూ, ఒక్కొక్క అడుగే ఆచితూచి వేయాల్సి ఉంటుంది… ఇంత ప్రమాదకరం అయినా సరే కొందరు భక్తులు ఆ సాహసోపేత, ప్రాణాంతక ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు… అది చేస్తేనే దేవుడి కరుణ దక్కుతుందనేది వారి విశ్వాసం… నిజానికి ఇక్కడ ప్రదక్షిణలు చేయగలిగిన భక్తుడు ఏ సర్కస్ ఫీటయినా అలవోకగా చేయొచ్చు… ఒకాయన నిన్న ఇలాగే ప్రదక్షిణలకు పూనుకున్నాడు… రెండు పూర్తి చేశాడు… మూడోది చేస్తుంటే పట్టు తప్పింది, కాలు జారింది, కిందకు పడిపోయాడు… ప్రాణాలు కోల్పోయాడు… పాపం… కింద ఈ ఫోటో చూడండి ఓసారి…
అరెరె, ఇదేందబ్బా… మరీ ఇంత దారుణమా..? అని ఆశ్చర్యపోకండి… భక్తి ఎట్ పీక్స్… అనిపిస్తున్నదా..? అదంతే… ఆ ప్రాణాంతక భక్తి నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు… నిజానికి ఈ ప్రదక్షిణలు చేయాలని ఆ గుడి పూజారులో, నిర్వాహకులో చెప్పరు, అసలు ఎంకరేజ్ చేయరు కూడా… కానీ కొందరు భక్తులు గుడ్డిగా ప్రయత్నిస్తూనే ఉంటారు… మనవాళ్లే నయం, ఆత్మప్రదక్షిణ చేసేసి, మమ అనిపించేస్తారు… లేకపోతే దేవుడు కొలువై ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు… మరీ ఈ స్థాయిలో ప్రదక్షిణలకు సాహసించరు… అన్నట్టు నిన్నటి విషాద సంఘటన తాలుకు ఆ వీడియో చూస్తారా..? అయితే చూడండి.

క్రెడిట్స్ : ముచ్చట
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)