ఇతర మతాలు విషయంలో అస్సలు జోక్యం చేసుకోకుండా కేవలం హిందూ మతాన్నే టార్గెట్ చేస్తున్న సుప్రీం కోర్ట్

అది దీపావళి పటాసులు కానివ్వండి… శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశం కానివ్వండి… పద్మనాభస్వామి గుడి సంపద కానివ్వండి… రోహింగ్యాలను పంపించడంపై నిషేధం కానివ్వండి… శనీశ్వరాలయం కానివ్వండి…… సుప్రీం కోర్టు హిందూ మత విశ్వాసాల్లోకి ఇష్టారాజ్యంగా జొరపడుతున్నదీ అనేది ఓ విమర్శ…. ఇవేకాదు, ఎడాపెడా ప్రభుత్వం చేయాల్సిన పనులూ తనే చేసేస్తున్నది…

ప్రొయాక్టివ్‌ జుడిషియరీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం… ఆ మోడీని వదిలేయండి… ఓ స్టేట్స్‌మన్, ఓ రియల్ లీడర్ గనుక ప్రభుత్వంలో ఉంటే ఆ పరిస్థితి వేరు… మోడీ ప్రభుత్వం క్రియాశూన్యంగా, చలనరహితంగా చేష్టలు దక్కి పిచ్చి చూపులు చూస్తున్నదీ అనే ఆరోపణ బలంగా వినిపిస్తూ ఉంది… చివరకు హైదరాబాదులో సైతం బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చటాన్ని నిషేధించినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నది… తెలంగాణలో నడుస్తున్నది పోలీసు రాజ్యమే కాబట్టి దీన్ని ఊహించవచ్చు… అయితే… తరతరాలుగా ఆనవాయితీలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, విశ్వాసాల్లోకి సుప్రీం కోర్టు జొరబడి తమకు ఇష్టమొచ్చినట్టు తీర్పులు ఇచ్చేస్తూ ఉంటే… హిందుత్వ అనుకూల మోడీ ప్రభుత్వానికి కాళ్లూచేతులు ఎందుకు ఆడటం లేదు అనేది ఆ విమర్శల సారాంశం… అసలు మోడీకి దేశ పాలనవ్యవస్థపై ఏమైనా అవగాహన ఉందా…? ఓ డైరెక్షన్ అంటూ ఉందా..? అనే సందేహాలూ సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి… సరే, అది పక్కన పెడితే…. శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి కాంగ్రెస్ నేత, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చీఫ్ ప్రయర్ గోపాల కృష్ణన్ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి… ఒక మోడీకి, ఒక ప్రవీణ్ తొగాడియాకు, ఒక మోహన్ భగవత్‌కూ చేతకాని వైఖరి ఇది…

మెజారిటీ హిందూ మతస్థుల విశ్వాసాలు దేశంలో ఎందుకూ కొరగాకుండా పోతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఈ గోపాలకృష్ణన్ వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది… ‘‘ఏం చేయాలి..? ఒకవేళ సుప్రీం శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని నిర్దేశిస్తే ఏం చేయగలం..? 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు గుడి ప్రవేశం, స్వామి దర్శనం తప్పనిసరి చేశారు అనుకొండి… ఏం..? మర్యాదస్తులు, భక్తి విశ్వాసాలు, గుడి సంప్రదాయాలపై గౌరవం ఉన్నవాళ్లు వస్తారా..? రారు… ఒకవేళ వస్తే వాళ్లందరికీ భద్రత సాధ్యమేనా..? ఏం..? దీన్ని శబరి థాయ్‌లాండ్ చేద్దామా..?’’ అంటూ ‘తొక్కలో సుప్రీం’ అనే స్థాయిలో మాట్లాడాడు… నిజంగా ఒక మతానికి సంబంధించి, ఒక ఆలయ సంప్రదాయాలకు సంబంధించి సమూలంగా మార్పులు నిర్దేశించే బాధ్యత, అధికార స్థాయి సుప్రీంకు ఉందా అనేది దీంతో బాగా చర్చనీయాంశమవుతున్నది… ప్రత్యేకించి ఇతర మతవిశ్వాసాల్లోకి స్వేచ్ఛగా జొరబడలేని సుప్రీం, హిందూ సంప్రదాయాల్లోకి అంత స్వేచ్ఛగా ఎందుకు జొరపడుతున్నది….? ఇదీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం…

ఒక చేతన్ భగత్, ఒక రాందేవ్ బాబా స్థాయిలో కూడా ఈ మోహన్ భగవత్‌లూ, వందలాది పీఠాధిపతులు, సోకాల్డ్ వీహెచ్‌పీలు, భజరంగ్‌దళ్‌లూ, యోగీలు, సంఘ్ పరివార్ సైలెన్స్ ఎందుకు పాటిస్తున్నాయి అనేది కూడా జాతీయ స్థాయిలో పలు మీడియా సైట్లలో చర్చలకు దారితీస్తున్నది… అయితే ఇక్కడ సుప్రీం తీర్పులు, విచక్షణ, అధికార పరిధి ఏమిటనేది పక్కన పెడితే… తను కేవలం హిందూ విశ్వాసాల్లోకే ఎందుకంతగా దూకుడుగా జొరపడుతున్నది అనేదీ ప్రశ్నే… చర్చనీయాంశమే… తరతరాల విశ్వాసాలకు కొత్త నిర్వచనాలు ఇస్తూ, సరికొత్త మార్పులు సూచిస్తూ, ఇలా ఉండాలీ అని నిర్దేశిస్తూ సుప్రీం వెలువరిస్తున్న తీర్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్…. ఓ మిత్రుడు చెప్పినట్టు…. మోడీ పాలన బాధ్యతల్ని కూడా సుప్రీంకు అప్పగించి రాజీనామా చేయొచ్చుగా…. చాలా సీరియస్ కామెంట్… కానీ బహుముఖంగా డిబేటబుల్…. ‘హిందువుగా బతకడమే పాపమా..? నేరమా..?’ అనే ఓ ప్రాథమిక ప్రశ్నను చర్చల్లోకి లాక్కొస్తున్న కామెంట్… చూడాలిక, ఇది ఇంకా ఎటు దారి తీస్తున్నదో…!!
క్రెడిట్స్ : ముచ్చట
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)