అన్నగారి ఆజ్ఞను జవదాటడం ఇష్టంలేక తనకు తానుగా ఆత్మత్యాగం చేసుకుంటాడు లక్ష్మణుడు

రామాయణం అంటే తెలియని వ్యక్తులు ఉండరు. మతాలతో, కులాలతో, దేశాలతో సంబంధం లేకుండా.. రామాయణం గురించి తెలుసుకునే వ్యక్తులు ఎందరో ఉన్నారు. వాల్మీకి రామాయణాన్ని ఆద్యంతం అత్యంత రక్తి కట్టిస్తు రచించారు. రామాయణం ఎలా మొదలైంది అనే విషయాన్ని పక్కన పెడితే.. శ్రీరాముడు జననం నుంచి లవకుశల పుట్టుక వరకు ఉన్న రామాయణం గురించి అందరికీ తెలుసు. ఎన్నో గ్రంధాల్లో చదువుకున్నాం. 

లంక నుంచి సీతను అయోధ్యకు తీసుకొచ్చిన తరువాత, కొంతకాలానికి ఓ వ్యక్తి కారణంగా సీత అడవులకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడే లవకుశలు జన్మిస్తారు. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి యాగాశ్వాన్ని విడిచిపెట్టగా.. ఆ అశ్వాన్ని లవకుశలు బందించడం.. రాముడు తో లవకుశలు తలపడటం.. సీత వచ్చి వారిని అడ్డుకోవడం.. సీత లవకుశలను రాముడికి అప్పగించి భూదేవిలో కలిసిపోవడం జరుగుతుంది.

అనంతరం శ్రీరాముడు లవకుశలతో సహ అయోధ్యకు వెళ్తాడు. ప్రజారంజకంగా దాదాపు 11 వేల సంవత్సరాలు పరిపాలన సాగిస్తాడు. ఇలా పరిపాలన సాగించే సమయంలో.. ఓ విషయంపై నరకలోకాధిపతి యముడు రాముడి వద్దకు వస్తాడు.శ్రీరాముడితో సమావేశం అవుతాడు. ఏకాంతంగ జరుగుతున్న ఆ సమావేశానికి ఎవరు భంగం కలిగించకూడదని.. ఎవరూ ఆ సమావేశ మందిరంలోకి రాకూడదని, ఎవరైనా అలా వస్తే వారిని చంపేయమని ఆజ్ఞాపిస్తాడు.

సమావేశం జరుగుతుండగా ఆ సమావేశ మందిరంలోకి లక్ష్మణుడు వస్తాడు. అయితే, రాముడి ఆజ్ఞగురించి తెలుసుకున్న లక్ష్మణుడు.. అన్నగారి ఆజ్ఞను జవదాటడం ఇష్టంలేక.. తనకు తానుగా ఆత్మత్యాగం చేసుకుంటాడు. అన్నపై ఉన్న గౌరవానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు. రాముడ్ని చూసి మోహించినందుకు ల‌క్ష్మ‌ణుడు శూర్ఫ‌న‌ఖ అనే స్త్రీ ముక్కు కోస్తాడు క‌దా. నిజానికి ఆమె రావ‌ణుడి చెల్లెలే. ఆమె అంటే అన్న అయిన రావ‌ణుడికి ఎంతో ప్రేమ‌. కానీ చివ‌రికి ఆమె రావ‌ణుడు చ‌నిపోవాల‌ని కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె భ‌ర్త దుష్ట‌బుద్ధిని రావ‌ణుడు చంపుతాడు. దీంతో ఆమె త‌న అన్న రావ‌ణుడు చ‌నిపోవాల‌ని కోరుకుంటుంది. అది అలాగే జ‌రుగుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)