ఐదేళ్ల వయసులోనే జీవిత కాలంలో అనుభవించే కష్టాలన్నీ అనుభవిస్తుంది

మనిషి ప్రకృతిపై.. పై విజయం సాధించాను అని భావించినప్పుడల్లా.... సరికొత్త అంశాన్ని ప్రకృతి మనిషి ముందుకు తీసుకోస్తూనే ఉన్నది.. మనిషికి సవాల్ విసురుతూనే ఉన్నది.. ఓ చిన్నారి ఐదేళ్ల వయసులోనే జీవిత కాలంలో అనుభవించే కష్టాలన్నీ అనుభవిస్తుంది. 4 ఏళ్ల చిరు ప్రాయంలోనే ఈ చిన్నారికి ఋతుస్రావం మొదలైంది. ఈ బాలిక ఆదిసన్స్ వ్యాధి బారిన పడి.. ముప్పై ఏళ్ల వయస్సు వారిలో కూడా అరుదుగా కనిపించే లక్షణాలతో ఈ ఐదేళ్ల చిన్నారి ఇప్పుడే బాధపడుతున్నది.

పుట్టినప్పుడు అందరి పిల్లలాగే పుట్టింది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ కు చెందిన ఏమిలీ డోవర్స్. రెండు వారాల తర్వాత ఈ చిన్నారి పెరుగుదల అసాధారణంగా మారింది.. నాలుగు నెలలకే ఏడాది చిన్నారిగా అసాధారణంగా కనిపించింది.. ఎమిలీ రెండేళ్ల వయస్సులో రొమ్ముల పెరుగుదల, శరీరం నుంచి వాసన రావడం, చర్మం పై దద్దుర్లు రావడం మొదలయ్యాయి.. అనంతరం అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం మొదలయ్యాయి.. దీంతో చిన్నారిని వైద్యం కోసం తీసుకొని వెళ్ళగా ఆడిసన్స్ వ్యాధి బారిన పడినట్లు వైద్య పరీక్షలో తెలిసింది. అంతేకాదు.. పుట్టుకతో వచ్చిన అడ్రినల్ హైపర్ ప్లాసియా, సెంట్రల్ ప్రికాసియస్ పబర్టీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెన్సారి ప్రొసెసింగ్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నట్లు వైద్యుల పరీక్షల్లో తెలిసింది. దీంతో హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేస్తే.. 5 ఏళ్లకే మెనో పాజ్ దశకి చేరుకొంది.. అడ్రినల్ గ్రంధికి వచ్చే చాలా అరుదైన వ్యాధి ఇది.. రెండు హార్మోన్లు కార్టి సోల్, ఆల్దోస్టిరాన్ ల లోపంతో ఈ చిన్నారి బాధపడుతుంది.

కాగా ఎమిలీ తల్లి టామ్ డోవర్ ఈ విషయం పై స్పందిస్తూ.. తాను మిగతా పిల్లల కంటే భిన్నం అని ఎమిలీ కి తెలుసు.. నిరంతరం నొప్పి, చురుకుదనం లోపించడంతో ఫిజియోథెరపీ సెషన్లలో పాల్గొనాల్సి ఉంది.. హార్మోన్ల రీప్లేస్ మెంట్ తో 50 ఏళ్ళకు మహిళలకు ఎదురయ్యే దుష్ప్రభావాలను అయిదేళ్లకే ఈ చిన్నారి కి వచ్చే అవకాశం ఉంది.. చిన్నతనం లో అనుభవించాల్సిన బాల్యం ను కోల్పోయిన ఎమిలీ 4 ఏళ్ల వయస్సులోనే ఋతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుసుకోవాల్సి వస్తుంది అని అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఎమిలీ వైద్య సాయానికి భారీగా డబ్బు అవసరం కనుక "గోఫండ్మీ" లో విరాళాల కోసం ఓ పేజీ ని క్రియేట్ చేశారు.. నాలుగేళ్లకే 50 ఏళ్ల మహిళ అనుభవిస్తున్న బాధను అనుభవిస్తున్న ఈ చిన్నారికి వచ్చిన వ్యాధిని ప్రపంచ బాలిక దినోత్సవం రోజున వెల్లడించింది. పాపకు మెరుగైన వైద్యం అందించడం కోసం విరాళం కోసం తల్లి అర్ధిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)