కంటి సమస్యలు శ్వాస కోశ వ్యాధిని పెంచి భారతదేశంపై ప్రతీకారం తీర్చుకునేపనిలో చైనా

చైనా బాణాసంచా చీప్ అందులో అధిక మోతాదులో గంధకంతోపాటు పొటాషియం క్లోరేట్/పెర్‌క్లోరేట్ కూడా వాడతారు అది బాగా అస్థిరమైన, పేలుడు స్వభావం కలిగిన రసాయనం అది చర్మ సంబంధ సమస్యలకు, రకరకాల అలర్జీలు పెరగటానికి కారణం అవుతుంది కాబట్టి ఇండియా 1992లోనే దాని వాడకాన్ని నిషేధించింది. ఇండియాలో పొటాషియం, సోడియం నైట్రేట్ వాడతారు ఇవి కొంచెం సేఫ్. సో, ప్రమాదకర రసాయనాలు, ఇండియా నిషేధించిన రసాయనాలతో ఉత్పత్తి చేస్తారు కాబట్టి చైనా బాణాసంచా అక్రమం, చట్టవిరుద్ధం. 2014లోనే భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ ‘‘విదేశీ బాణాసంచా అమ్మకం, కలిగి ఉండటం చట్టవిరుద్ధం’’ అని ప్రకటించింది

ఇంటెలిజెన్స్ ప్రకారం, పాకిస్తాన్ భారతదేశంపై నేరుగా దాడి చేయలేదు, కనుక అది భారతదేశంపై ప్రతీకారం తీర్చుకోవటానికి చైనా సహాయం తీసుకుంది. భారతదేశంలో ఉబ్బసం వ్యాధిని వ్యాప్తి చేయడానికి చైనా ప్రత్యేక రసాయనాలను బాణాసంచాలో నింపి, నేపాల్ మీదుగా ఇండియాకు స్మగుల్ చేస్తున్నది. ఈ పటాకులు శ్వాసకోస వ్యాధిని పెంచే కార్బన్ మోనాక్సైడ్ అనే విషపూరిత వాయువులను వెలువరిస్తాయి. అంతేకాకుండా, భారతదేశంలో కంటి లోపాలను సృష్టించేందుకు ప్రత్యేక కాంతి సృష్టించే బాణసంచాను కూడా తయారు చేశారు. పెద్ద శబ్దాలను సృష్టించే పాదరసంతో నిండి ఉంటుంది. దయచేసి ఈ దిపావళికి ఈ చైనీస్ ఉత్పత్తులను ఉపయోగించవద్దు. ఈ సందేశం అందరి భారతీయులకు తెలియజేయండి… జై హింద్.. ఇది ఇప్పుడు వాట్సాప్ లో బాగా వైరల్ అవుతున్న మెసేజ్. ఓకే దీనిలో నిజానిజాలు ఒక్క సారి చూడండి.
మనం వాడే పొటాషియం, సోడియం నైట్రేట్ కన్నా చైనా వాడు వాడే పొటాషియం క్లోరేట్ ధర చాలా తక్కువ అందుకని చైనా బాణాసంచా చీప్. సో, అవి అమ్మితే మన వ్యాపారులకు విపరీతమైన మార్జిన్ ఉంటుంది అందుకే ఇవి త్వరగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాయి. పొటాషియం క్లోరేట్ త్వరగా మండుతుంది, ఎక్కువ శబ్దం ఇస్తుంది, ఎక్కువ వెలుతురు ఇస్తుంది కాబట్టి వినియోగదారులూ ఇష్టపడుతున్నారు. ఎక్కువ గంధకం ఉండటం వల్ల ఆ పటాకులు నేత్రసంబంధ, శ్వాససంబంధ సమస్యల్ని పెంచే ప్రమాదముంది. ఇదీ ఓ వాస్తవం. బాణాసంచా తయారీలో చైనా నంబర్ వన్. ప్రపంచవ్యాప్తంగా సప్లయ్ చేస్తూ ఉంటుంది. అయితే మనం నిషేధించిన రసాయనాల్ని వాటి తయారీలో వాడుతున్నారు కాబట్టి, చైనా బాణాసంచాను ప్రభుత్వం అక్రమమని ప్రకటించింది కాబట్టి, కొంత దేశభక్తి తాలూకు ఎమోషన్స్ కూడా ఉంటాయి కాబట్టి. చైనా బాణాసంచా కొనడం, కాల్చడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు… !!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)