ఆ చిన్నారి దగ్గరి నుంచి ఫోన్ తీసుకుంటే గిలగిలా కొట్టుకుంటుంది

ప్రస్తుత సమాజంలో టెక్నాలజీని విరివిగా వాడే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ క్రమంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫోన్లు, గ్యాడ్జెట్స్‌ను వాడుతుండటం మనం చూస్తున్నాం. తాజాగా ఓ చిన్నారి ఫోన్‌ను అతిగా వాడడం వల్ల మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆ చిన్నారి దగ్గరి నుంచి ఫోన్ తీసుకుంటే ఫోన్‌ కావాలని విలవిలా కొట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోని చూస్తే మనసు చలించిపోతుంది.

వీడియోలో ఓ చిన్నారి ఆసుపత్రిలో మంచంపై పడుకుని విలవిలా కొట్టుకుంటోంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌ను చూపించగానే తనకు తెలియకుండానే కొట్టుకోవడం ఆపేసి ఫోన్‌నే తదేకంగా చూస్తోంది. దానిని తీయగానే తిరిగి మళ్లీ విలవిలా కొట్టుకుంటోంది. ఈ వీడియో చూడండి.

'ఈ వీడియో చూసి ఎంతో బాధపడ్డా. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సందర్భంగా తల్లిదండ్రలకు ఒక విజ్ఞప్తి. దయచేసి మీ పిల్లలను మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంచండి. మితిమీరిన వాడకం ఎంతో ప్రమాదం' అని హర్భజన్ సింగ్ హెచ్చరించాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)