రాత్రి 7 గంటలు తర్వాత ఈ పనులు అస్సలు చేయద్దు చేస్తే శారీరకంగా, మానసికంగా చాలా నష్టపోతారు

పగలంతా ఎంతో పనిచేసి అలసిపోయి, ట్రాఫిక్‌ను ఛేదించుకుంటూ ఇంటికి చేరుకుంటారు ఉద్యోగులు. పగలంతా పడిన కష్టాన్ని ఇంటి బయటే మర్చిపోయి, తర్వాతి రోజుకు రీఫ్రెష్‌ అవ్వాలి. అయితే చాలామంది రాత్రి ఏడు గంటల తర్వాత కొన్ని తప్పులు చేస్తూ శారీరకంగా, మానసికంగా ఆనారోగ్యానికి గురువుతున్నారట. అవేంటో తెలుసుకుందాం..

1) చాలామంది ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే డ్రస్‌ కూడా మార్చకుండా ఆదరాబాదరాగా తినడం మొదలుపెడతారు. ఇది మంచిది కాదట. సాయంత్రం సమయంలో తీసుకునే స్నాక్స్‌ కేవలం మానసికమైన ఆనందం కోసమే తప్ప.. ఆకలి తీర్చుకోవడానికి కాదు. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసి బట్టలు మార్చుకుని అప్పుడు తక్కువ స్థాయిలో ఆహారం తీసుకుంటే మానసికంగా ఆహ్లాదంగా ఉంటుందట.

2) ఇక సాయంత్రం తాగే టీతోపాటు భారీగా స్నాక్స్‌ లాగించేస్తూ ఉంటారు కొందరు. అందులో ముఖ్యంగా ఉండేది జంక్‌ఫుడ్డే. సాయంత్రం సమయంలో, అదీ మరికొద్ది సేపట్లో రాత్రి భోజనం చేసే ముందు ఇలాంటి ఆహారం తీసుకోవడం ఎన్నో ఆనారోగ్యాలకు దారి తీస్తుందట.

3) చాలామంది సాయంత్రం సమయం నుంచి మంచినీళ్లను పక్కనబెడుతుంటారు. పగటి సమయంతో సమానంగా రాత్రి వేళల్లో కూడా తగినంత నీటిని తీసుకోవాలట.

4) ఇక పగలంతా అలసిపోయి ఇంటికి వచ్చిన వారు టీవీ ముందే గంటల తరబడి సెటిల్‌ అవుతారు. టీవీ చూడడం తప్పేం కాకపోయినా రాత్రి సమయాల్లో గంటకు మించి చూడడం మంచిది కాదట. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడడం, పుస్తకాలు చదవడం వంటివి చేయాలట.

5) చాలామంది రాత్రి భోజనాన్ని భారీగా తీసుకుంటారు. నిజానికి రోజు మొత్తంలో చేసే భోజనంలో బ్రేక్‌ఫాస్టే కీలకమైనది. రాత్రి భోజనానికి అంత ప్రాధాన్యం లేదు. అందుకే తేలికగా జీర్ణయమ్యే ఆహారం తీసుకోవాలట. అలాగే భోజనం చేసిన వెంటనే నిదురించడం మంచిది కాదట.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)