శివుడు వచ్చి వెళ్ళే ప్రదేశం. ఈ పర్వతానికి మ్యాజికల్ పవర్స్ జీవితంలో ఒక సారైనా ఈ ఓం పర్వతాన్ని సందర్శించుకోవలసిందే

ఓం ఈ మాట విన్నా, మన నోట పలికినా మనస్సులో ఒక రకమైన భక్తి, ధైర్యం, ఆధ్యాత్మికత, మానసికప్రశాంతత కలుగుతాయి. ఓం ప్రతిమంత్రం ముందూ వస్తుంది. ప్రతీ పనికి, ప్రతీ పూజకు, ఈ ఓం కార నాదం పలుకుదాం. ఈ ఓంకార నాదం అనేది సర్వేశ్వరుని జ్యోతి పలికిన నాదం. ఆ దేవదేవుడి శరీరం నుండి ఒక జ్యోతిపుట్టింది.అందులో శృతిబద్ధంగా ఒక నాదంపుట్టింది. అదే ఓంకారం. 

ఈ ఓం కారం పలికినవాళ్ళకు అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలుకూడా వుంటాయని ప్రతీతి. ఐశ్వర్యంకంటే ఆరోగ్యమే ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు.అందుకే వారు ఓంకారనాదంతో బ్రతికేవాళ్ళుఎలాంటి నీళ్ళు, ఆహారం లేకుండా మునులు, దేవుళ్ళు కేవలం ఓంనాదం పలుకుతూ రోజుల తడబడి ఏళ్ళతడబడి తపస్సు చేసుకునేవాళ్ళు. నాభినుండి మొదలయ్యే ఆ నాదం మెదడులోని నరాలనుకూడా కదిలిస్తుంది. ఇక ఓంనమఃశ్శివాయ అంటే మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మనస్సులో ఎలాంటి అలజడి మానసిక ఇబ్బందులున్నా కూడా ఓం కారనాదం తొలగిస్తుంది. ఇది ఒక అత్యంత పవిత్రమైన పదం. ఇది ఒక పరమపవిత్రమైన హిందూ మత ప్రతీక. ఇంతటి గొప్ప ఓం కారం హిందువులు పుణ్య క్షేత్రంగా, మ్యాజికల్ గా భావించే హిమాలయాలలో కనిపిస్తే అది మనందరి అదృష్టమే.
నిజమైన ప్రకృతిసిద్ధంగా పుణ్యక్షేత్రంలో మనం పవిత్రమైన ఓంకారాన్ని చూడవచ్చును. అది ఎక్కడోకాదు హిమాలయాల్లోనే. దానినే ఓంకార పర్వతం అంటారు. ఈ ఓం పర్వతం ఇండియా, నేపాల్ సరిహద్దులో వుంది. ఈ ప్రాంతం కొంత నేపాల్, మరో కొంతభాగం ఉత్తరాఖండ్ రాష్ట్రసరిహద్దుల్లో వుంటుంది. దూరంనుండి చూస్తే మంచుతో ఓంకారం స్పష్టంగా కనిపిస్తుంది. దానివెనుకాల నల్లటికొండ వుండటంతో ఈ ఓం పర్వతం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొండను చూడాలంటే పెట్టిపుట్టాల్సిందే నంటారు పండితులు. ఎందుకంటే పురాణాల ప్రకారం 8 ఓం కార పర్వతాలుండాలి. కాని మనకు అత్యంత స్పష్టంగా కనిపించేది ఈ ఓంకార పర్వతం మాత్రమే.పైగా ఇది కైలాసపర్వతాన్ని పోలివుండటం మరోవిచిత్రం. దీనికి ఆదికైలాస్ అని, చోటాకైలాస్ అని, బాబాకైలాస్ అని కూడా పేర్లువున్నాయి. దీనికి ప్రకృతిపరంగా కూడా ఈ పర్వతానికి మ్యాజికల్ పవర్స్ వున్నాయి అని అంటారు.
ఆగస్టు-సెప్టెంబర్ సమయంలో చూస్తే ఈ పర్వతానికి ఓంకార బొట్టుపెట్టినట్లుగా కనిపించి భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ పర్వతాన్ని కైలాసమానస సరోవర యాత్రచేసే వాళ్ళు ఓంపర్వతాన్ని కూడా దర్శించుకునితమ జీవితాలను ధన్యం చేసుకోవచ్చును. ఆ ముక్కంటి తిరిగిన ముల్లోకాలలో ఒక్కటైన ఈ ప్రాంతాన్ని చూడాలంటే నిజంగా అదృష్టం వుండాల్సిందే. ప్రతి ఒక్క హిందువు ఈ ఓం పర్వతాన్ని చూడలేక పోయినాకూడా ఆయన మనకిచ్చిన ఓంకారాన్ని పాటించినా కూడా మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ ఓంకార పర్వతానికి సాక్ష్యాత్తూ ఆ పరమ శివుడు వచ్చివెళుతూ వుంటాడు అని కూడా చాలా మంది నమ్ముతారు. ఆ పరమ శివుడు కైలాసగిరి పర్వతం తర్వాత ఇక్కడికే ఎక్కువగా వచ్చివెళుతూ వుంటాడని చెబుతుంటారు. ఎందుకంటే మానవాళి, స్పిరిట్చ్యువాలిటీ మొదలయ్యేదే ఓం కారంతో. యోగ అయినా, పూజయినా సరే ఈ నాదం లేకుండా ఏదీ జరగదు. కాబట్టి జీవితంలో ఒక సారైనా ఈ ఓం పర్వతాన్ని సందర్శించుకోవలసిందే.

అల్మోర కుమావొన్ ప్రాంతం లో ఎత్తైన ప్రదేశం లో కల ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. 5 కి. మీ. ల పరిధి గల ఈ ప్రదేశం సూయల్ నది మరియు కోసి నది మధ్య కలదు. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 1651 మీ. ల ఎత్తున వుంది చుట్టూ అందమైన పచ్చని అడవులు కలిగి వుంటుంది. క్రి. శ. 15 మరియు 16 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని చాంద్ మరియు కాత్యూర్ వంశాలు పరి పాలించాయి. పర్యాటకులు హిమాలయాల యొక్క మంచు తో నిండిన శిఖరాలను అల్మోర కొండలనుండి చూసి ఆనందించవచ్చు. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం ప్రపచంత వ్యాప్తంగా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాసర్ దేవి టెంపుల్, నందా దేవి టెంపుల్, చితి టెంపుల్, కాతర్మాల్ సన్ టెంపుల్ వంటివి ఇక్కడ కల కొన్ని మతపర క్షేత్రాలు. ఇక్కడ కల ప్రాచీనమైన నందా దేవి టెంపుల్ ను కుమావొనీ శిల్ప శైలి లో నిర్మించారు.
ఈ టెంపుల్ లో చాంద్ వంశం పూజించిన దేవత కలదు. ప్రతి సంవత్సరం భక్తులతో దేవాలయం కిట కిట లాడుతుంది. ఇక్కడే మరొక టెంపుల్ కాసర్ దేవి టెంపుల్ కూడా అల్మోర కు 5 కి.మీ.ల దూరం లో కలదు. ఈ టెంపుల్ ను 2 వ శతాబ్దం లో నిర్మించారు. స్వామి వివేకానంద తన తపస్సు ను ఇక్కడ చేసారని చెపుతారు. పర్యాటకులు ఇక్కడ అందమైన సూర్యోదయ మరియు సూర్యాస్తమయ దృశ్యాలు బ్రైట్ ఎండ్ కార్నర్ నుండి చూడవచ్చు. సిమ్టోల మరియు మర్టోల ప్రదేశాలు పిక్నిక్ కు బాగుంటాయి. అల్మోర టవున్ నుండి ౩ కి. మీ.ల దూరం లో కల జింకల పార్క్ ప్రసిద్ధి. దీనిలో అనేక లేళ్ళు, చిరుతలు హిమాలయ బ్లాకు బేర్ వంటివి కలవు. ఈ ప్రదేశం లో కల గోవింద్ వల్లభ పంత్ మ్యూజియం, బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి తప్పక చూడాలి. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ట్రెక్కింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ తప్పక ఆచరిస్తారు. 

ఈ ప్రదేశానికి వాయు, రైలు, రోడ్ మార్గాలలో తేలికగా చేరవచ్చు. పంత్ నగర్ ఎయిర్ పోర్ట్, కతోగోడం రైల్వే స్టేషన్ అల్మోర కు సమీపం. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం. ఢిల్లీ నుండి అల్మోర కు అనేక లక్జరీ బస్సులు కలవు. ఢిల్లీ - అల్మోర ల మధ్య 350 కి. మీ. ల దూరం కలదు. సమీప ప్రదేశాల నుండి ప్రభుత్వ బస్సులు కూడా కలవు. అల్మోర కు సుమారు 75 కి. మీ. దూరంలో కత్గోడం రైలు స్టేషన్ కలదు. ఈ రైలు స్టేషన్ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు తరచుగా రైళ్ళు కలవు. అల్మోర కు సమీప ఎయిర్ బేస్ ప్యాంటు నగర్ ఎయిర్ పోర్ట్. ఇది సిటీ సెంటర్ నుండి 125 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నేరుగా ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు రెగ్యులర్ విమాన సేవలతో కలుప బడింది. పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీలలో అల్మోర చేరవచ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)