నమ్మలేరు కానీ ఇది పచ్చి నిజం ఒక లీటర్ పాము విషం ఖరీదు 27 లక్షలు అదే తేలు విషమైతే 26 కోట్లు

నమ్మలేక పోతున్నాం.. కానీ ఇది నిజమే... ఒక లీటర్ పాము విషం ఖరీదు 27 లక్షలు, అదే తేలు విషమైతే పాము విషానికి 130 రెట్లు ఎక్కువగా 26 కోట్ల ధర పలుకుతుంది.

ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవ పదార్ధంగా తేలు విషం పరిగణింపబడుతుంది. సాధారణంగా తేలు తన ఆహారం కోసం ఇతర కీటకాలను చంపటానికి, తనను శత్రువుల బారి నుండి రక్షించుకోవటానికి తన కొండి లోని విషాన్ని ఉపయోగిస్తుంది. కానీ అదే విషం మనుషుల్లో ఎన్నో రోగాలకు, రుగ్మతలకు మందుగా కూడా వాడబడుతుంది. తేళ్ళలో వేల రకాల జాతులున్నా కానీ కేవలం 25 రకాల జాతుల్లో మాత్రమె జీవులని చంపేటంత విషాన్ని కలిగి ఉంటాయి.
తేలు విషంలోని ప్రోటీన్ కీళ్ళ వాపుకు, పేగు వ్యాధికి, మరియు కొన్ని రకాల కేన్సర్ చికిత్సకు కూడా దివ్యౌషదంగా ఉపయోగపడుతుంది.. అందువలనే ఈ అరుదైన తేలు విషం అంత ఎక్కువ ధర పలుకుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)