ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా ఆస్తమ వ్యాది తగ్గించుకునే గొప్ప మార్గం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమా, ఉబ్బసంతో బాధపడే వారి సంఖ్య కొన్ని కోట్లలో ఉంది. దీని నుంచి బయటపడటానికి వారు ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఊపిరి పట్టేయడం, విపరీతమైన దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఇవ్వన్నీ ఆస్తమా రోగులకు ఉండే లక్షణాలు. ఒకసారి ఆస్తమా బారిన పడితే తగ్గడం అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు ఆస్తమా తో బాధపడుతున్న వారికి శుభవార్త.

వేలకు వేలు ఖర్చుపెట్టే దానికన్నా ప్రతి రొజూ యోగా చేస్తేచాలని చైనీస్ యూనివర్శిటీ అంటోంది. ప్రతిరోజూ కొంత సమయం యోగా కోసం వెచ్చిస్తే రోగం మటుమాయం అవుతుందని ఓ సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా పేషెంట్ల సమస్యకు పరిష్కారం కోసం పరిశోధనలు చేసి వెయ్యిమంది పురుషులు, మహిళలతో వరుసగా యోగా చేయించారు. ఈ ఆరు ఆసనాలు ద్వారా ఆస్తమా పూర్తిగా నయం అవుతుంది. వీడియో చూడండి

అలా చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపించాయని అధ్యయనంలో గుర్తించింది. యోగాసనాల వల్ల ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ తగ్గించడం కోసం వాడే మందులు పరిమాణం తగ్గిందని గుర్తించారు పరిశోధకులు. యోగా వల్ల ఆస్తమా రోగులపై ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవంటున్నారు. భారత్ లో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న యోగా ఆస్తమా రోగులకు వరం లాంటిదని హాంగ్ కాంగ్ లో చైనీస్ యూనివర్శిటీ తేల్చడం విశేషం. ఆరు నెలలపాటు యోగాసనాలతో పాటు ధ్యానం వల్ల మెరుగైన ఫలితం కనిపించిందని పరిశోధకులు చెబుతున్నారు.

అదేవిధంగా మనం రోజూ కూరల్లో రుచిని, సువాసనను ఇచ్చేందుకు వాడే అల్లం ద్వారా కూడా ఆస్తమాను అదుపు చేయవచ్చని అంటున్నారు నిపుణులు. అల్లం అధికంగా వాడడం వల్ల ఆస్తమాను అదుపు చేయవచ్చని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు చెబుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)