మందు తాగిన తర్వాత నోరు వాసన రాకుండా ఉండాలని ఏవేవో చేస్తుంటారు కానీ ఈ పని మాత్రం చేయద్దు

ఫుల్లుగా తాగేసి.. ఇంట్లో తెలియకుండా ఉండాలని మందుబాబులు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదేదో నములుతుంటారు. కొన్ని రకాల ద్రావణాలను నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటారు. అయితే ఏం చేసినా గానీ పళ్లు మాత్రం తోముకోవద్దంటున్నారు నిపుణులు. 
మద్యం తాగిన తర్వాత వాసన రాకుండా ఉండాలనే ప్రయత్నాల్లో భాగంగా పళ్లు తోముకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పళ్లకు ముప్పు వస్తుందనీ, దంతాల పటిష్టత తగ్గిపోతుందని చెబుతున్నారు. పళ్లపై ఉండే తెల్లటిరంగు (ఎనామిల్) కోల్పోయి పళ్లు పుచ్చిపోతాయంటున్నారు. మద్యంలో ఆమ్లం ఎక్కువగా ఉంటుందనీ, తాగిన వెంటనే బ్రష్ చేసుకోవడం వల్ల ఆ ఆమ్లంతో పళ్లు తోముకున్నట్లయి... పళ్లు పుచ్చిపోయే ప్రమాదముందంటున్నారు. కాబట్టి మందు తాగిన తర్వాత ఎట్టి పరిస్తితిలో పళ్ళు తోముకోవద్దు. బ్రష్ తోనే కాదు నోట్లో నీళ్ళు పోసుకుని వేలుతో తోముకోవడం కూడా చాలా పొరపాటు. సో అదండీ విషయం ఎప్పుడు మందు తాగిన ఈ విషయం మర్చిపోవద్దు. ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)