తిరుమలకొండ ఎప్పుడూ చల్లదనంతో ఉంటుంది. చల్లనినీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు అయినా స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతకలిగి వుంటుంది

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు. ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు. ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి. 

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో వుంటుందో తెలుసా ? స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతకలిగి వుంటుంది. తిరుమల కొండ 3000 అడుగుల ఎత్తు కలది. తిరుమలకొండ ఎప్పుడూ చల్లదనంతో  కూడిన ప్రదేశం. తెల్లవారుజామున 4.30 గంలకు చల్లనినీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలని తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీవేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూలవిరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. 

శ్రీవారి ఆలయంలో ప్రతి ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజగదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోర్ట్ చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలి, అప్పం, వడ, జంతికలు, జిలేబి, పాయసం, దోస, రవకేసరి, బాదంకేసరి, జీడి పప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు. అయితే శ్రీ వారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భ గుడిలో పెరుగన్నం మినహా ఏదీనైవేద్యంగా పోదు. స్వామివారికి నైవేద్యంగా సమర్పించే పెరుగన్నంమాత్రం భక్తుడికి ప్రసాదంగా లభిస్తే అది మహాభాగ్యంఅని పురోహితులు అంటున్నారు.
ఇక స్వామివారి వస్త్రాల సంగతికి వస్తే స్వామివారికి ధరించే పీతాంబరం 21అడుగుల పొడవు, 6 కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రువారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగనెల అంతటా బిల్వదళాలనే స్వామి వారికి అర్పిస్తారు. శివ రాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి తిరుమాడవీధుల్లో వూరేగిస్తారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)