40,000 శవాలకు పోస్టుమార్టం చేసిన అతను చెప్పిన మాటలు వింటే కన్నీళ్ళు వస్తాయి. చిన్న పిల్లలకు పోస్టుమార్టం చేసే సమయంలో

శవాలను కోయడం ఆయన విధి! విధి నిర్వహణలో భాగంగా 40 సంవత్సరాల కాలంలో 40 వేల శవాలను కోసేశాడు ఆ ఉద్యోగి!! 40 వేల శవాలకు పోస్టుమార్టం చేసిన ఆ ఉద్యోగికి ఇటీవలే సన్మానం చేశారు థానే మేయర్!!! ఉత్తరప్రదేశ్ అలీఘర్‌కు చెందిన బనారసి శ్యామ్‌లాల్ చౌట్టుల్(64) కుటుంబం 1973లో ముంబైకి వలస వచ్చింది. శ్యామ్‌లాల్ తండ్రి, తాత థానే ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసేవారు. ఈ క్రమంలో శ్యామ్‌లాల్ కూడా వార్డు బాయ్‌గా రూ. 175 జీతంతో ఉద్యోగంలో చేరాడు. రెండేళ్ల తర్వాత మార్చురీ డిపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ అయ్యాడు.

విధి నిర్వహణలో భాగంగా నాటి నుంచి కొద్ది రోజుల క్రితం వరకు 40,000 శవాలకు పోస్టుమార్టం చేశాడు శ్యామ్‌లాల్. నెలకు కనీసం 700 డెడ్‌బాడీలకు శవ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాడు. శ్యామ్‌లాల్ 2014లో పదవీ విరమణ పొందినప్పటికీ.. ఆయన సేవలను మొన్నటి వరకు థానే ఆస్పత్రి ఉపయోగించుకుంది. ఇటీవలే థానే మేయర్ మీనాక్షి షిండే.. శ్యామ్‌లాల్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా శ్యామ్‌లాల్ మాట్లాడుతూ.. మృతదేహాల నుంచి వెలువడే దుర్గంధాన్ని ఒక్కోసారి భరించలేకపోయేవాళ్లమని తెలిపారు. ఈ క్రమంలో శవపరీక్ష కంటే ముందే తాను ఆల్కహాల్ తీసుకునే వాడినని చెప్పారు. దీనికి వైద్యుల అనుమతి ఉండేదన్నారు. చిన్న పిల్లలకు పోస్టుమార్టం చేసే సమయంలో మాత్రం పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది, మనసును ప్రభావితం చేస్తుందని, ఆగకుండా కన్నీళ్లు వచ్చేస్తాయని పేర్కొన్నారు.
2006లో థానే మున్సిపల్ ట్రాన్స్‌పోర్టు బస్సు చేనా బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో 32 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు అత్యవసరంగా విధుల్లోకి పిలిచారని శ్యామ్‌లాల్ తెలిపారు. పగలు, రాత్రి కష్టపడి 32 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబాలకు డెడ్‌బాడీస్‌ను అప్పగించామని గుర్తు చేశారు.

శ్యామ్‌లాల్ భార్య కూడా థానే ప్రభుత్వాసుపత్రిలో హౌస్‌కీపర్‌గా పని చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆమె ధైర్యం చెబుతూ.. సమస్యల్లో పాలుపంచుకుంటుందని తెలిపారు. తమ పిల్లలు కూడా అప్పుడప్పుడు మార్చురీకి వచ్చి వెళ్తుంటారని.. ఆ సమయంలో వారు కూడా బాధ పడుతుంటారని శ్యామ్‌లాల్ పేర్కొన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)