చుండ్రు తో బాధపడుతున్నారా ? అయితే ఇదిగోండి శాశ్వత పరిష్కారం

చాలా మందికి చుండ్రు సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. దీన్ని అరికట్టేందుకు పలు రకాలైన మందులను వాడుతుంటారు. అయినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం లభించదు. ఇలాంటి ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.
ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగు కప్పుల గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నిమ్మరసం, నాలుగు చెంచాల కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు దట్టించి తలకు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత తలకు గుడ్డ చుట్టాలి. ఈ గుడ్డను రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక రోజు చొప్పున నెలలో నాలుగుసార్లు చేసినట్టయితే చుండ్రు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)