బెండకాయ నీటితొ వంట్లోని కొవ్వు మరియు షుగర్ రెండూ తగ్గుతాయి. ఇది చేసుకోవడం చాలా సులభం అదెలాగో మీరే చూడండి

బెండకాయ తింటే తెలివితేటలు పెరుగతాయన్నది చాలా మంది నమ్మకం. అదే బెండకాయ నీటిని తాగితే శరీరంలో చేరిన అధిక కొలెస్ట్రాల్‌ను, బ్లడ్‌ షుగర్‌ను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. బెండకాయను మూడు లేదా నాలుగు ముక్కలుగా చేసి ముందురోజు రాత్రి వాటిని గ్లాసు నీటిలో వేసి ఉంచుకోవాలి. మరుసటిరోజు ఉదయాన్నే పరగడుపున ముక్కలను తీసివేసి ఆ నీటిని తాగితే కొలెస్ట్రాల్‌ స్థాయిని తేలికగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇదే విషయం మీద వారు పరిశోధనలు కూడా నిర్వహించారు. పచ్చి బెండకాయలను తినడం వల్ల మరింత ప్రయోజనం పొందవచ్చని, అలా తినడానికి ఇష్టపడని వారు ఈ విధంగా చేస్తే మంచిదని వారు అంటున్నారు. బెండకాయల్లో లభించే పోషకాలు కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయని వారు చెబుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)