తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడిలో ఒక పిల్లి గురించి మీకు తెలుసా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. తిరుమల తిరుపతి, ఆ 7కొండల పేరువింటేనే భక్త జనం ఒళ్ళు పులకరిస్తుంది. భక్తి ఆవహిస్తుంది. శ్రీ మహావిష్ణువైన వేంకటేశ్వరుడైన ఆదిశేషుని ఏడు పడగలే, ఈ ఏడుకొండలు. కలియుగంలో స్వామివారికి ఎంత విశిష్టత వుందో ఆయన నివసించిన ఏడుకొండలకి కూడా అంతే ప్రాముఖ్యతవుంది. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషదాలు, కోటితీర్ధాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులే ఈ శేషాచల కొండలు. తిరుమల వెంకన్నకు శేషాచల కొండలంటే చాలా ఇష్టం. ఈ ఏడు కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర వుంది. వైకుంటంలో అలిగివచ్చిన లక్ష్మీ దేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడు కొండలపై కొలువైవున్నాడని స్థలపురాణం చెబుతుంది.


వైకుంటంలో నిత్యం శ్రీవారి చుట్టూ వుండే అనుచరులే నిత్యం భూలోకం వచ్చి ఏడుకొండలుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన సప్తగిరి వాసుడైనాడు. నంది వృషభాద్రి అయ్యాడు. హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకొంటున్నాడు. స్వామివారికి తొలిసారిగా తల నీలాలు సమర్పించిన నీల నీలాద్రి కొండగా మారింది. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవ చేస్తున్నాడు.ఇక నారాయణాద్రి, వెంకటాద్రులు స్వామివారి రూపాలే. ఈ రెండు కొండలు జయవిజయములకు ప్రతిరూపాలు అంటారు. అలాంటి చరిత్ర కలిగిన ఈ ఏడు కొండలు ఒకటి కాదు, వంద కాదు. ఏకంగా 150కోట్ల ఏళ్ల చరిత్రవుంది ఈ ఏడుకొండలకి. ఇలాంటి ఈ పవిత్ర పుణ్యక్షేత్ర గిరుల్లో ఆ వెంకటేశ్వర స్వామి తిరుగుతున్నాడు అంటేతప్పక నమ్మాలి. ఇందుగలడు అందు లేడు అనే సందేహం లేకుండా ఎందెందు చూస్తే అందందే కనిపిస్తాడు ఆ కలియుగదైవం.

శ్రీ వారి గర్భగుడిలో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తు వస్తోంది. మాములుగా శ్రీ వారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకులచే తెరువబడుతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జీయంగారు స్వామి, ఏకాంగితో పాటుగా 'సన్నిధి గొల్ల' అనబడే ఒక యాదవుడూ మాత్రమే ప్రవేశిస్తారు. కాని అదే సమయంలో అశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిలిలో ప్రవేశిస్తుంది. ఇది శ్రీ వారి లీల మాత్రమే గాని మరియొకటి కాదు. ఈ పిల్లి (లేక పిల్లులు)సుమారుగా 100 సంవత్సరముల(ఈ గుడితో సంబధం ఉన్నటువంటి పూర్వికుల నుండి గ్రహించిన సమాచారం మేరకు) నుండి శ్రీ వారి గర్భాలయంలో వున్నట్టు తెలుస్తోంది. మాములుగా రాత్రి శ్రీ వారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసి వేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీ వారిని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోను లోపల ఎవ్వరు ఉండకుడదు.

ఇది అనుచానంగా శ్రీ వారి ఆలయంలో వస్తున్న సంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమంతప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలో నే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది. ఈ పిల్లి శ్రీ వారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది. అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీ వారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది. శ్రీ వారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయమేంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీ వారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా వుంటుంది. ఈవిధంగా శ్రీ వారు మనుష్యులతో పాటు జంతువులను కుడా కటాక్షిస్తున్నారు!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)