బియ్యం కడిగిన నీళ్ళు పారేయకండి ఆ నీటి వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి

వయసులో ఉన్న వారికి ఇబ్బంది పెట్టె ఆరోగ్య సమస్యల్లో మొకంపై వచ్చే మొటిమలు ఒకటి. మొకంపై వచ్చే ఈ మొటిమలు మనకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే వాటిని తగ్గించుకునేందుకు గాను వివిధ ఆయింట్ మెంట్స్ వాడుతుంటారు. ఎన్ని చేసినా మొటిమలు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పైగా అవి ఖర్చుతో కూడుకున్నవి. మొటిమలతో బాధపడే వారికి ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఒక మార్గం ఉందని అంటున్నారు నిపుణులు. మరో అదెలాగో చూద్దాం.

సాధారణంగా మనం ఇళ్ళలో అన్నం చేసుకునేప్పుడు బియ్యాని కడిగి ఆ నీటిని పారబోస్తాం లేదా పశువులకు తాగిస్తాం. ఇది అందరూ చేసేదే... కానీ ఆ నీటి ద్వారా మన మొహం పై వచ్చే మొటిమలను దూరం చేసుకోవడమే కాకుండా మన అందాన్ని మరింత పెంచుకోవచ్చట. మొటిమలపైనా బియ్యం కడిగిన నీళ్లు ప్రభావం చూపిస్తాయి. బియ్యం కడిగిన నీటిలో మాములు టిష్యు పేపర్ ని ముంచి ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. ఈ నీటితో ముఖంపై రాషెస్‌ ఉన్న ప్రదేశంలో రుద్దితే మంచి గుణం కనిపిస్తుంది.

పదిహేను నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బియ్యం కడిగిన నీటిలో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా ముఖంపై ఉన్న రాషెస్ తగ్గుతాయి. ఈ నీటిలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని అందిస్తాయట.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)