యూనియన్ బ్యాంకులో జాబ్స్. నెలకు 45950 జీతం దీనితోపాటు స్పెషల్‌ అలవెన్స్‌, డియర్‌నెస్‌ అలవెన్స్‌, ఇతర అలవెన్స్‌లు కూడా

పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రముఖమైనదిగా పరిగణించే యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘క్రెడిట్‌ ఆఫీసర్‌’(స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 200 ఖాళీలు ఉండగా జనరల్‌ వర్గానికి 62, ఒబిసిలకు 65, ఎస్సీలకు 49, ఎస్టీలకు 24 పోస్టులను కేటాయించారు. వీటిలోనే దివ్యాంగుల కోసం ఎనిమిదింటిని రిజర్వు చేశారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంబిఎ(ఫైనాన్స్‌)/ సిఎ/ ఐసిడబ్ల్యుఎఐ/ సిఎఫ్‌ఎ/ఎఫ్‌ఆర్‌ఎం/ సిఎఐఐబి వంటి కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏదేని షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం తప్పనిసరి.

అభ్యర్థి వయస్సు అక్టోబరు 4 నాటికి కనిష్ఠంగా 23 ఏళ్లు, గరిష్ఠంగా 32 ఏళ్లకు మించరాదు. రిజర్వుడు వర్గాలవారికి ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు లభిస్తుంది.

క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికను ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు. బ్యాంక్‌ నిర్ణయం ప్రకారం అభ్యర్థులను ఎంపిక ప్రక్రియలోని అన్ని మోడ్స్‌ / వాటిలోని ఏదైనా ఒకదాని ద్వారా సెలెక్ట్‌ చేయవచ్చు.

ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ / టెస్ట్‌ వివరాలు: పరీక్ష సమయం రెండు గంటలు. మొత్తం మార్కులు 200. రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ అంశాల నుంచి మల్టిపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌ ఇస్తారు. ఒక్కో అంశం నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. రీజనింగ్‌కు 25 మార్కులు, క్యుఎకు 50, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు 100, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌కు 25 మార్కులు ఉంటాయి. ఈ ఎగ్జామ్‌లో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది.

ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ మార్కులు భిన్న రూపంలో వస్తే దానికి దగ్గరి పూర్ణ సంఖ్యను నిర్ణయించి ఆ మేర మార్కులను అభ్యర్థి సాధించిన మార్కుల్లోంచి తగ్గిస్తారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ మినహాయించి మిగిలిన అంశాలకు సంబంధించిన ప్రశ్నలన్నింటినీ హిందీ, ఇంగ్లీషు మాధ్యమాల్లో ఇస్తారు. బ్యాంక్‌ అభిప్రాయం మేరకు ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ నిర్మాణం మారే అవకాశం ఉంది. ఎగ్జామ్‌కు సంబంధించిన కాల్‌ లెటర్స్‌ను బ్యాంక్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, లక్‌నవ్‌, ముంబై
ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ జరుగు తేదీ: నవంబరు 25
ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌లో అర్హత పొందిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. మెరిట్‌ మార్కుల ఆధారంగా జనరల్‌ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, రిజర్వుడ్‌ వర్గాలవారిని 1:5 నిష్పత్తి ప్రకారం ఇంటర్వ్యూకి పిలుస్తారు.
పర్సనల్‌ ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని, నాయకత్వ లక్షణాలను, ఆలోచన విధానాన్ని అంచనావేసే ప్రయత్నం జరుగుతుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూలో అర్హత పొందాలంటే కనీసం 25 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. రిజర్వుడు వర్గాలవారికి 22.5 మార్కులు వస్తే చాలు.
ఇంటర్వ్యూలో కనీసార్హత మార్కులు సాధించని వారిని పోస్టింగ్‌కు ఎంపిక చేయరు. ఇంటర్వ్యూ జరిగే తేదీలు, వేదిక తదితర వివరాలను సంబంధిత అభ్యర్థులకు సమయానుసారం బ్యాంక్‌ తెలియజేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్‌ ఉంటుంది. అభ్యర్థి మూడేళ్ల వరకు బ్యాంక్‌లో ఉద్యోగిగా కొనసాగుతానని అంగీకరిస్తూ బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఈ మూడేళ్లలోపు బ్యాంక్‌ సర్వీస్‌ నుంచి వైదొలగాలనుకుంటే మాత్రం బ్యాంక్‌కు రూ.2,50,000 + జిఎస్‌టి + ఇతర ట్యాక్స్‌లు చెల్లించాలి.
ఫైనల్‌గా ఎంపికైన ఉద్యోగికి 31705-1145/1-32850-1310/ 10-45950 బేసిక్‌ పేస్కేలు వర్తింపజేస్తారు. దీనితోపాటు స్పెషల్‌ అలవెన్స్‌, డియర్‌నెస్‌ అలవెన్స్‌, ఇతర అలవెన్స్‌లు కూడా ఉంటాయి. అంతేకాకుండా బ్యాంక్‌ విధానాలకు అనుగుణంగా రెసిడెన్షియల్‌ క్వార్టర్స్‌ సౌకర్యం, రీయంబర్స్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌/ హాస్పిటల్‌ ఎక్స్‌పెన్సెస్‌ వంటివి వర్తిస్తాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అండ్ ఒబిసి అభ్యర్థులకు రూ.600 కాగా ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులకు రూ.100.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి. డిడి/ చెక్‌/ పోస్టల్‌ ఆర్డర్‌ తదితరాలను అంగీకరించరు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2017, అక్టోబరు 21
వెబ్‌సైట్‌: www.unionbankofindia.co.in
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)