మీరు కొనేది స్వచ్ఛమైన పుట్ట తేనె అనుకుంటున్నారా ? అది అక్షరాలా పంచదార పాకం

తేనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. ఈ పాయింట్ మార్కెటింగ్ కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. FMCG కంపెనీలు తేనె ద్వారా ఆదాయాల్ని పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒక కంపెనీ.. ప్రత్యర్థి కంపెనీ కంటే తమది గొప్ప తేనె అంటూ ప్రచారం చేసుకుంటోంది. మన దేశంలో డాబర్ కంపెనీ డాబర్ హనీ పేరుతో, ఇమామి కంపెనీ జండూ హనీ పేరుతో తేనెను విక్రయిస్తున్నాయి. హనీకి సంబంధించి దేశంలో ఇవి పెద్ద బ్రాండ్లు. సహజంగానే వీటి మధ్య పోటీ గట్టిగా ఉంటుంది.

‘ప్యూరిటీ అండ్ క్వాలిటీ’ పరంగా.. యూరోపియన్ యూనియన్(EU) స్టాండర్డ్స్ ప్రకారం తాము నెంబర్ వన్ అని డాబర్.. పేపర్లలో టీవీల్లో యాడ్లు ఇస్తోంది. ఈ యాడ్ లోని ‘క్వాలిటీ’ అనే మాటపై ఇమామి తీవ్రంగా అభ్యంతరం చెబుతోంది. చెప్పడమే కాదు అడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI)కి ఫిర్యాదు కూడా చేసింది.

ఇమామి ఫిర్యాదుపై డాబర్ కూడా తీవ్ర స్థాయిలోనే స్పందించింది. ఇమామీకి చెందిన ‘జండూ హనీ’లో యాడెడ్ సుగర్ 30 శాతం దాకా ఉందని చెప్పింది. కానీ ఇమామీ మాత్రం.. మార్కెట్లో ఉన్న ఇతర బ్రాండ్లలోనే సుగర్ ఉన్నట్లు ప్రచారం చేస్తోందని డాబర్ తెలిపింది. డాబర్ ఆరోపణలపై ఇమామీ స్పందించింది. తాము మార్కెట్లో ఉన్న పలు రకాల తేనె బ్రాండ్లను పరీక్షించామని.. ప్రతి బ్రాండులోనూ 20 నుంచి 70 శాతం సుగర్ ఉందని తెలిపింది. (యాడెడ్ సుగర్ అంటే.. తేనెలో సహజంగా ఉండే చక్కెరకు అదనంగా చక్కెర కలపడం. తద్వారా తేనె రుచి పెరుగుతుంది. కస్టమర్లకు స్వీటుగా ఉంటుంది.)

ఇమామి, డాబర్ పరస్పర ఆరోపణల నేపథ్యంలో రెండు కంపెనీల తేనె బ్రాండ్లను ఇండిపెండెంట్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలని ASCI ఆదేశించింది. మన దేశంలో బ్రాండెడ్ తేనె మార్కెట్ విలువ రూ.600 కోట్లుగా ఉంది. ఇది ప్రతి యేటా 15 నుంచి 20 శాతం పెరుగుతోంది. బ్రాండెడ్ తేనె అంటే చాలా మంది డాబర్ హనీనే గుర్తుకొస్తుంది. కానీ ఇటీవలి కాలంలో జండు(ఇమామి), పతంజలి తేనె బ్రాండ్లు కూడా మార్కెట్లో వాటాను పెంచుకుంటున్నాయి. స్వచ్ఛమైన పుట్ట తేనె రుచి చూడటం ఈతరంలో చాలా మందికి సాధ్యం కావడం లేదు. సర్వం కల్తీ అయిపోతున్న వేళ స్వచ్ఛమైన తేనె దొరకాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)