ఓ పాస్టర్ పాపాలు పోగొడతాడు దేవుని వాక్యం చెబుతాడు కానీ తను మాత్రం మందు జల్సాలు అమ్మాయిలతో రాసలీలలు

ఆయన ఓ పాస్టర్. చర్చి నడుపుతున్నారు. ప్రభువు పేరుతో సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. పాపాలను పొగొడతానని చెప్పుకుంటారు. ప్రజలు సన్మార్గంలో పయనించేందుకు కృషి చేస్తానంటారు. ఇదంతా చేస్తున్నాడంటే ఆయన ఎంత పవిత్రుడో అని అనుకుంటారు. కానీ ఆ పాస్టర్ అసలు స్వరూపం బయటపడింది. ఆయన రాసలీలలు, దుర అలవాట్లు, దురాఘతాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పాస్టర్ అసలు రంగుని బయటపెట్టింది మరెవరో కాదు.. అతడి మతానికి చెందిన మరో చర్చి పాస్టర్.

విజయవాడలో క్రైస్తవ సంఘాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ‘జీసస్ మిరాకిల్స్’ పేరిట చర్చి నడుపుతూ, పరిశుద్ధ జలం విక్రయాలు సాగిస్తున్న పాస్టర్ ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో పాస్టర్ బయటపెట్టారు. అమ్మాయిలతో పాస్టర్ ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఓ హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ‘జీసస్ మిరాకిల్స్’ పేరిట ప్రదీప్ అనేక అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ కూడా యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.


ప్రదీప్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు ఆ వీడియోలో చూపించారు. అంతేకాదు పడకగదిలో మద్యం సేవిస్తూ బైబిల్‌ను కాలు దగ్గర పెట్టుకున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ప్రదీప్, తన అనుచరులు సైతం మద్యానికి బానిసలుగా మారినట్లు చూపించారు. అమ్మాయిలతో తిరుగుతూ, మద్యం తాగుతూ, అమాయకులైన ప్రజలను ప్రదీప్ ఎలా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని ఈ వీడియోలో వివరించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)