రెండు నెల‌లు అమ్మాయి అబ్బాయితో గ‌డుపుతుంది. ఆ స‌మ‌యంలోనే అమ్మాయి నెల‌త‌ప్పాల్సిందే

టొడ గిరిజ‌న తెగ‌ పేరు విన్నారా ఎప్పుడైనా? అదెక్క‌డుంది అని ఆశ్చ‌ర్య‌పోకండి.. మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌డానికి ఇంకా చాలా విష‌యాలు ముందున్నాయి. వీళ్లు ఓ వింత ఆదివాసీలు. ఎందుకు వింత అంటే.. వీళ్లు చేసే ఏ ప‌ని అయినా.. కొత్త‌గా, వింత‌గా ఉంటుంది. త‌మిళ‌నాడు లోని నీల‌గిరి ఫారెస్ట్ లో ఉంటుంది ఈ తెగ‌. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఉద‌గ‌మండ‌లం(ఊటీ) ఏరియా కు స‌మీపంలోని ఫారెస్ట్ లో ఉంటార‌ట‌. ఇక‌.. అస‌లు విష‌యానికి వ‌స్తే.. అక్క‌డ స్పెషాలిటీ ఏంటంటే? వాళ్ల పెళ్లిళ్లు ఎంతో సంప్ర‌దాయ బ‌ద్దంగా.. వింత‌గా, విన‌డానికే ఆశ్చ‌ర్యంగా ఉంటాయి. అస‌లు ఏంటా టొడ గిరిజ‌న క‌థ.. తెలుసుకుందాం ప‌దండి...

సహ‌జంగా పెళ్లి వేడుక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి. పెళ్లి జ‌రిగేట‌ప్పుడే కాని.. టొడ గిరిజ‌న తెగ ప్ర‌జ‌లు మాత్రం పెళ్లి స‌మ‌యంలో ఎటువంటి వేడుక‌లు చేసుకోరు. జ‌స్ట్ సింపుల్ గా పెళ్లి చేసుకుంటారు. ఎవ్వ‌రినీ పిల‌వ‌రు. పెళ్లి త‌ర్వాత ఓ నెల‌, రెండు నెల‌లు అమ్మాయి.. అబ్బాయితో గ‌డుపుతుంది. ఆ స‌మ‌యంలోనే అమ్మాయి నెల‌త‌ప్పాల్సిందే. ఆ త‌ర్వాత అమ్మాయి త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వెళ్లిపోతుంది.

ఆ త‌ర్వాత విల్లు, బాణం వేడుక‌లు జ‌రుగుతాయి. అంటే.. భార్య‌ గ‌ర్భిణిగా ఉన్న ఏడు నెల‌ల‌కు భ‌ర్త‌ అడ‌వికి వెళ్లి చెట్టు కాండంతో విల్లు, బాణం భార్య‌కు న‌చ్చేలా త‌యారు చేసుకొని తీసుకువ‌చ్చి త‌న భార్య‌కు బ‌హుమ‌తిగా ఇవ్వాలి. ఆ విల్లు త‌న భార్య‌కు న‌చ్చి దాన్ని తీసుకుంటేనే అప్పుడు త‌న క‌డుపులో పెరుగుతున్న బిడ్డ‌కు త‌న భ‌ర్తే తండ్రి అని ఒప్పుకోవ‌డ‌మే కాకుండా అత‌డిని త‌న భ‌ర్త‌గా ఒప్పుకుంటుంది.

ఇక‌.. ఆస‌మ‌యంలో జరిగే వేడుక‌లే ఆ ప్రాంతంలో అంబ‌రాన్నంటుతాయి. సంప్ర‌దాయ బ‌ద్ద‌మైన డ్యాన్సుల‌తో, పాట‌ల‌తో క‌ల‌ర్ ఫుల్ డ్రెస్సులు వేసుకొని తెగ ఎంజాయ్ చేస్తారు. విదేశీయులు కూడా ఈ వేడుక‌ల్లో పాల్గొంటార‌ట‌. వేడుక‌లు పూర్త‌య్యాక పెద్ద‌ల ఆశిర్వాదం తీసుకొని అప్ప‌టి నుంచి భార్యాభ‌ర్త‌ల్లా జీవితాంతం క‌లిసి ఉంటార‌ట ఆ దంప‌తులు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)