పాపం మంచు లక్ష్మికి ట్విట్టర్‌లో భలే కంచు దొరికింది కెలికి మరీ పంచులు వేయించుకుంటుంది. రెండో సారి మరో దిమ్మతిరిగే కౌంటర్

పాపం మంచు లక్ష్మికి ట్విట్టర్‌లో భలే కంచు దొరికింది. ఆమె పేరు రస్న. ఆల్రెడీ ఒక ట్వీట్ పెట్టి ఆ ట్వీట్ కి పంచ్ వేయించుకుంది కదా ‘‘అయ్యో, అయ్యో, నేను హైదరాబాద్ ట్రాఫిక్ జాములో గంటల కొద్దీ ఇరుక్కుపోయాను, ఒరే, ఒరే, రాజకీయ నాయకులూ మీ ప్రొటోకాల్స్ వదిలేసి మాలాగా తిరగండర్రా, మా కష్టాలు అర్థమవుతాయి, గుర్‌ర్‌ర్‌ర్’’ అంటూ మంచు లక్ష్మి ఓ పోస్టు పెట్టింది కదా దానికి రస్న భలే కౌంటర్ ఇచ్చింది కాకపోతే డిఫరెంటుగా ‘‘అబ్బ, అలాగా… మంచిగనే చెప్పినవు గానీ, నువ్వు వీఐపీ హోదాలో తిరమల వెళ్లినప్పుడు, క్యూలో నిల్చున్న నాలాంటి సగటు భక్తులు పడే అవస్థలు నీకు అర్థమవుతున్నాయా మరి..?’’ అని పంచ్ వేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో చిర్రెత్తినట్టుంది అసలే మంచువారి జీన్స్ కదా మాటపడే రకం, మాట ఉంచుకునే రకం కానే కాదు కదా సో, రివర్స్ పంచులకు సిద్ధపడింది ఎలా అంటే…?

తరువాత మంచు ‘‘ఎహె, వీఐపీ ఏముంది..? నువ్వూ చెల్లించు… సగటు మనుషులు తిరిగే మామూలు రోడ్లకూ దీనికి లింకేంటి..? మాటలు వదలడం చాలా ఈజీ అయిపోయింది ’’ అన్నట్టుగా ఓ ట్వీట్ వదిలింది అంటే రస్న కామెంటుకు పంచ్ కానీ ఈ కంచు ఊరుకోలేదు ‘‘అబ్బో, అలాగా, నేనూ వీఐపీ కావచ్చా..? ఓహో, మనమూ వీఐపీలు అయిపోదాం, క్యూలలో ఉండే సగటు మనుషులను ఆపేద్దాం… వీఐపీలు కావడం, ఆ హోదాతో చక్కర్లు ఈజీ అయిపోయింది…’’ 
అన్నది. ఆ రెండ్లు ట్వీట్ లు ఆ ట్వీట్ లకు కౌంటర్లు కింద మీరే చూడండి.

సరే, వీళ్ల వాదులాట ఎలా ఉన్నా ఈ రస్న తిరుమలలో వీఐపీ దర్శనాలపై ట్విట్టర్‌లో మంచి చర్చను మొదలెట్టింది. వెంకన్నను పేద భక్తుడికి దూరం చేసి, హైజాక్ చేసి, కేవలం బడా బడా భక్తుల దేవుడిగా మార్చేస్తున్న తీరుపై ఎంత చర్చ జరిగినా మంచిదే.
తను ఏమంటున్నదంటే..? ఎల్‌2 వీఐపీ బ్రేక్ దర్శన్ తీసుకోవాలంటే టీటీడీ ఉద్యోగులతోపాటు, ముఖ్యమంత్రులు, మంత్రులు, జడ్జీలు, సివిల్ సర్వెంట్లు, పెద్ద పెద్ద పొలిటికల్ గ్రూపులు, నాయకుల రికమండేషన్ లెటర్స్ కావాలి. 45 నిమిషాలు వీళ్లకే దర్శనాలు జస్ట్, 20 నిమిషాల్లో దర్శనం చేసేసుకోవచ్చు సదరు భక్తుడు ఏకంగా మూలవిరాట్టు దగ్గరకు వెళ్లొచ్చు అక్కడ కాసేపు గడపొచ్చు హారతి కూడా కళ్లకద్దుకోవచ్చు తొక్కిసలాటలు ఉండవు వెళ్లు వెళ్లు అంటూ నెట్టేసేవారు ఉండరు. ఇలా చెప్పొకొచ్చింది అంతే కదా మరి ? శ్రీవారు ధనికుల దేవుడు.. వీవీఐపీల దేవుడు.. ప్రొటోకాల్ దేవుడు అయిపోతున్నప్పుడు ఈ విమర్శలు సహజమే కదా.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)