మేనల్లుడితో అక్రమసంబంధం పెట్టుకుని భర్తను చంపేసింది

సౌదీ నుంచి నగరానికి వచ్చిన యువకుడు దారుణ హత్యకు గురైన కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. మృతుని భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాసిన్‌ అలియాస్‌ సోను హతుడు రఫీక్‌కు స్వయానా అక్క కొడుకు కావడం గమనార్హం. గురువారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కైలాస్‌నగర్‌కు చెందిన రఫీక్‌ (37) సౌదీలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు.

ఇటీవల తండ్రి మృతి చెందడంతో నగరానికి వచ్చిన అతను గత ఆదివారం హత్యకు గురయ్యాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుని భార్య షెబ్‌ఎనూర్, మృతుని రఫీక్‌ అక్క కొడుకైన యాసిన్‌తో వివాహేతర సంబంధం కొసాగిస్తోంది. తమ విషయం భ ర్తకు ఎక్కడ తెలుస్తుం దోనన్న భయం తో అతని హత్యకు పథకం పన్నింది. ఆది వారం రాత్రి అందరూ నిద్రిస్తున్న స మ యంలో షెబ్‌ఎనూర్‌ తన ప్రి యుడితో కలిసి రఫీన్‌ను హత్యచేసి పరారయ్యారు. రఫీక్‌ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)