నేను సైన్యంలో పనిచేస్తూ దేశానికీ సేవ చేస్తుంటే అది వేరే వాడితో కడుపు తెచ్చుకుంది అందుకే నా భార్యను చంపేసాను

జాంజగీర్ ప్రాంతంలో ఆగస్ట్ 17న భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న ఓ సిపాయి కథలో ఉన్న దారుణమైన నిజాలు బయటకు వచ్చాయి. పోస్ట్ మార్టం రిపోర్టులో అతని భార్య మూడు నెలల గర్భవతి అని తేలింది. ఆ మహిళ చనిపోయిన రోజే ఆమెకు ప్రైవేట్ హాస్పిటల్ లో హెల్త్ చెకప్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే భార్యకు కడుపు తన వల్ల కాదని వేరే వ్యక్తితో వచ్చిందని తెలుసుకున్న భర్త.. భార్యను చంపి.. అతను రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు.

21సంవత్సరాల ఆకాష్ సింహ్‌కు మే 7 2017న నికిత తో పెళ్ళి చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అతను సైన్యంలో విధులు నిర్వహించేందుకు వెళ్ళగా.. భార్యను పుట్టింటిలో విడిచిపెట్టాడు. ఇటీవలే అతను సెలవుల్లో ఇంటికి వచ్చాడు. ఆమెను తన ఇంటికి పిలుచుకొని వచ్చాడు. ఆ రోజు ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు.. ఆమె మూడు నెలల గర్భవతి అని చెప్పారు. ఈ విషయంపై ఆకాష్ కు సందేహం మొదలైంది. తన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకొందని అనుకున్నాడు. ఫుల్ గా మద్యం తాగి.. బైక్ పై వీధుల్లో తిరిగాడని స్థానికులు చెప్పారు. రాత్రికి ఇంటికి వచ్చిన ఆకాష్ భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆమె మెడకు టెలిఫోన్ వైర్ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత రైలు కింద తలపెట్టి ఆకాష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 

చనిపోడానికి ముందు ఆకాష్ సూసైడ్ నోట్ రాశాడు. నేను నా భార్య చనిపోవాలని అనుకున్నానని.. మొదట నికితను గొంతు నులిమి నేనే చంపేశాను.. ఆ తర్వాత తాను కూడా రైలు కింద పడి చనిపోబోతున్నానని అందులో పేర్కొన్నాడు. ఇందులో నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని.. నేనే కారణమని తెలిపాడు. తాను సైన్యంలో పనిచేస్తున్నానని సంవత్సరంలో 2-3 నెలలు మాత్రమే ఇంటికి వస్తుంటానని నేను దేశానికీ సేవ చేస్తుంటే తాను వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అందుకే చంపేశానని సూసైడ్ నోట్ లో స్పష్టం చేశాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)