ట్విట్టర్ లో చురకలు: మంచు లక్ష్మికి దిమ్మతిరిగే కౌంటర్

హైదరాబాద్ ట్రాఫిక్ పై మంచులక్ష్మీ చేసిన ట్విట్ కు వచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినీ రంగంలోనే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ.. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 5వ తేదీ గురువారం సాయంత్రం మంచులక్ష్మీ చేసిన ట్విట్ కంటే ఆ అమ్మాయి ఇచ్చిన రిప్లయ్ దుమారం రేపుతోంది.

మంచులక్ష్మీ ట్విట్ : ఒకటిన్నర గంట నుంచి హైటెక్స్ దగ్గర ట్రాఫిక్ లో ఉన్నా. పొలిటికల్ లీడర్లు మాలా ప్రోటోకాల్ లేకుండా వెళితే తెలుస్తుంది.. ఈ ట్రాఫిక్ బాధలు ఏంటో అని ట్విట్ చేసింది.

దీనికి ఆ అమ్మాయి ఇచ్చిన రిప్లయ్ ఇలా ఉంది.

రస్నా రీ ట్విట్ : మీరు తిరుమల వెళ్లినప్పుడు సరిగ్గా మా ఆలోచనలు కూడా ఇలానే ఉంటాయి. మేం స్వామి దర్శనం కోసం క్యూలో గంటల తరబడి నిలబడినప్పుడు.. మీరు VIP ట్రీట్ మెంట్ లో వెళుతున్నప్పుడు మీరు అన్నట్లుగానే మా ఆలోచనలు ఉంటాయి. అని రీ ట్విట్ చేసింది.

హైదరాబాదీలకు ట్రాఫిక్ అనేది కామన్.. దీనిపై మంచు లక్ష్మి చేసిన ట్విట్ కామన్ గా అనిపించింది. అయితే రస్నా అకౌంట్ నుంచి వచ్చిర రీ ట్విట్ మాత్రం నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)