పాత బట్టల్ని సేకరించి వాటిని శుభ్రం చేసి, బాగు చేసి పేదలకి అందచేస్తున్న ఈ వ్యక్తికి శతకోటి నమస్కారాలు

గూంజ్ (ప్రతిధ్వని అనే అర్ధం) పేరిట ఓ సంస్థ పాతబడినవి, ఎక్కువగా వాడనవి, ఇతరత్రా సామగ్రి సేకరిస్తుంది. వాటిని ముందుగా శుభ్రం చేస్తుంది. అవసరమైన మార్పులు చేసి, నిజంగా బట్టలు అవసరమున్న వారికి అందిస్తుంది. ఇప్పుడు ఈ సేవ 22 రాష్ట్రాలకు విస్తరించింది. ఏటా ఈ సంస్థ ఇలా రీసైకిల్ చేసే పరిమాణం ఎంతో తెలుసా ? 3000 టన్నులు. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు పంపిణీ చేస్తారు. ఈ పని చేసే ఉద్యోగులకు చేసిన పనికి సరిపడా బట్టలు, ఆహారం ఇస్తారు.

అన్నింటికన్నా ఈ సంస్థ చేస్తున్న పెద్ద సేవ ఏమిటో తెలుసా..? అత్యంత చౌకగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ. మన దేశంలో సగానికి పైగా మహిళలు, ఆడపిల్లలు రుతుస్రావం సమయంలో పడే కష్టాలు తెలుసు కదా అనారోగ్యకర పద్ధతుల్ని పాటిస్తుంటారు. కారణం, డబ్బు ఎక్కువగా పెట్టి శానిటరీ ప్యాడ్స్ కొనలేకపోవడం, చైతన్య ప్రచారం లేకపోవడం. ఈమధ్య వాటిపైనా జీఎస్టీ వేసి పాలకులు మరింతగా పరిస్థితిని దిగజార్చిన సంగతి తెలిసిందే. ఇలా చౌక ప్యాడ్స్ అవసరమైన వారికి ఈ సంస్థ రెండు రూపాయలకు ఒక ప్యాడ్ అందిస్తుంది. మొదటి ఐదేళ్ళలో ఎన్ని ప్యాడ్స్ పంపిణీ చేసిందీ అంటే.. 40 లక్షలు..!

వీటి తయారీకి కూడా పాత బట్టలే ఆధారం. సేకరించిన బట్టల్ని శుభ్రం చేసి, వాటితోనే ప్యాడ్స్ తయారు చేస్తారు. 18 సంవత్సరాల ఈ కృషికి అంశు గుప్తాకు రామన్ మెగసెసే అవార్డు, వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనుబంధ సంస్థ Schwab foundation 2012లో బెస్ట్ సోషల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు ఇచ్చింది. నాసా, నైక్ వంటివీ ఈ సంస్థతో కలిసి పనిచేశాయి. ఎన్నో పురస్కారాలు సాధించినా ఇప్పటికీ ఆ కుటుంబం నిరాడంబరంగా ఉంటుంది. అన్నట్టు 2009 నుంచి ఏటేటా మన దేశంలో అక్టోబరు 2 నుంచి 8 దాకా Joy of Giving week గా నిర్వహిస్తారు. దానోత్సవ్… ఈ టైములో వాలంటీర్లు పాత బట్టలు, సామగ్రి సేకరించి గూంజ్ సంస్థకు అప్పగిస్తారు. తరువాత అవి ప్రాసెసయ్యాక పేదలకు అందుతాయి. మీకూ సాయం చేయాలని ఉందా ? ఈ సేవాక్రతువులో పాల్గొనాలని ఉందా ? డ్రాపింగ్ సెంటర్ అడ్రస్ ఇది. Barsyl house, KK towers 3, Sitaram Nagar, Near Diamond point, Secunderabad, Telangana - 500009. Timings for dropping_ 8 am to 8 pm, All days except Monday, Contact person - Sadhana Srivatsav. 9490750617.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)