ఈ 5 చిన్న చిట్కాలు పాటిస్తే రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది

Loading...
నిద్ర : రోజుకి ఎనిమిది నుంచి పదిగంటల పాటు నిద్రపోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సరిపడ నిద్రపోవడం వలన హార్మోన్లు సమతుల్యం అవుతాయి. భావోద్రేకాలు అదుపులో ఉంటాయి.

ఆహారం : పోషకాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించు కోవచ్చు. విటమిన్లు, మినరల్స్‌ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మినరల్స్‌ అధికంగా లభించే చేపలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, గింజలు, విటమిన్‌ ఎ ఎక్కువగా ఉండే గుడ్లు, లివర్‌, బిటాకెరోటిన్‌ ఉండే పాలకూర, చిలగడదుంప, క్యారెట్‌ వంటివి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించుకోవచ్చు.

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన అధిక బరువు తగ్గించుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. వారంలో కనీసం మూడు రోజుల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే మంచిది.

నీరు: రోజు మొత్తం మీద ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి నీరు మందుగా పని చేస్తుంది.

కాఫీ వద్దు: కాఫీ తాగడం వలన రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని నిపుణులు అంటున్నారు. శరీరం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...