ఏడు రోజులు ఈ గుడిలో హారతి ఇస్తే భయంకరమైన పక్షవాతం (పెరాలసిస్) కూడా నయం అవుతుంది

ఏదైనా రోగం వచ్చినప్పుడు సాధారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్తారు. అయితే ఆ రోగం నయం కాదు అని తెలిసినతర్వాత భగవంతుణ్ణి వేడుకుంటాము. మన భారతదేశంలో దేవతలను అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజిస్తాము. ఆశ్చర్యం ఏమంటే మన భారతదేశంలో మిరాకిల్స్ జరిగేది ముఖ్యంగా దేవతలు మరియు మానవ అవతారం ఎత్తిన దేవుళ్ళలో ప్రధానంగా చూడవచ్చును. ఈ వ్యాసంలో పక్షవాతం (పెరాలసిస్) వంటి నయం చేయలేనటువంటి భయంకరమైన రోగాల్ని కూడా నయం చేసే మహిమాన్విత దేవాలయం గురించి తెలుసుకుందాం.

సాధారణంగా వైద్యుల చేతిలో సాధ్యంకానటువంటివి, దేవాలయానికి వెళ్తే అవుతుంది అని భావించటం సహజం. అయితే నమ్మకం వుంటే మాత్రం ప్రతిఒక్కటి సాధ్యమౌతుంది,. భగవంతుడు మనతో పాటే వుంటాడని నమ్మకం కుదరటానికి ఈ దేవాలయం ఒక నిదర్శనం. ఈ దేవాలయంలో పక్షవాతం (పెరాలసిస్) వంటి నయం చేయలేనటువంటి భయంకరమైన రోగాలను కూడా నయం చేస్తారు. అసలు ఈ దేవాలయం ఎక్కడ వుంది ? ఆ దేవాలయానికి వచ్చే రోగులకు పెరాలసిస్ రోగం నిజంగా నయం అవుతుందా ? అని అనేక ప్రశ్నలకు జవాబులు ఈ వ్యాసం ద్వారా తెలుసుకోండి.

ఈ మహిమాన్వితమైన దేవాలయానికి ముఖ్యంగా పక్షవాతం (పెరాలసిస్) రోగంతో బాధపడుతున్నవారు ఎక్కువగా వస్తుంటారు. అలాంటివారు ఈ దేవాలయంలో 7రోజులు వుండవలెను. భక్తులు ఇక్కడ వుండటానికి వసతిసౌకర్యాలు కూడా ఉన్నాయి. ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు కూడా వున్నాయి. కానీ కేవలం కొన్ని గదులు కలిగిన భారీ భవనం నిర్మించబడింది. వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి మరియు వారి పక్షవాతం (పెరాలసిస్) వ్యాధిని నయం చేసుకుంటారు. ఇక్కడ పక్షవాతం ఉన్న రోగులేకాకుండా వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నవారు కూడా స్వామిని దర్శించుకుని రోగాలను నయంచేసుకుంటారు. ఇది ఒక మూఢనమ్మకం అని అనుకోవచ్చు అయితే అనేక చికిత్సలతో కూడా బాగుచేయలేనటువంటి వివిధ రోగులు ఈ దేవాలయానికి వచ్చి బాగుపడిన ఉదాహరణలు అనేకం వున్నాయి.

500ల సంవత్సరాలకు ముందు ఒక సన్యాసి గురువు ఈ ప్రదేశానికి వచ్చి తన తపశ్శక్తితో మరియు ధ్యానంతో అతను అక్కడికి వచ్చే వారి రోగాలను నయం చేస్తూవుండేవారు. ఆ సన్యాసి సమాధిని కూడా ఈ దేవాలయంలో చూడవచ్చును. ఈ సమాధిచుట్టూ 7 రోజులపాటు, 7ప్రదక్షిణలు చేసిన వారికి అనారోగ్యం అనేది దూరమౌతుంది అనేది భక్తుల ప్రబలమైన నమ్మకం. ఆ 7 రోజులు పాటు ప్రదక్షిణం చేసిన అనంతరం అక్కడ మంగళహారతి చేస్తారు. ఆ మహిమగల హారతి తీసుకున్న అనంతరం అనేక మంది రోగులకు పడిపోయిన కాళ్ళు, చేతులు తిరిగి వస్తాయి మరియు పక్షవాతంతో మాటపడిపోయిన వారు కూడా కొద్దికొద్దిగా మాట్లాడతారు. ఈ దేవాలయం ముఖ్య విశేషం ఏమంటే భక్తుల దగ్గర ఏవిధమైన డబ్బును ఆశించరు. బదులుగా భక్తులే తమ రోగాలునయం కావటం వల్ల దేవాలయం అభివృద్ధికి ధనసహాయం చేస్తారు. ఈ విధంగా వచ్చిన ధనసహాయంతో దేవాలయం నిర్వహణ చేస్తారు.

అసలు ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఈ దేవాలయం వుండేది రాజస్థాన్ రాష్ట్రంలో నాగూర్ జిల్లాలో. ఈ దేవాలయాన్ని చతూర్ దాస్ జీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం నాగూర్ జిల్లా దేగాన అనే మండలంలో బుడాటి అనే ప్రదేశంలో వుంది. ఈ దేవాలయం సుమారు 200సంల క్రితం నాటిదని చెప్పవచ్చును. ఆశ్చర్యంఏమంటే ఈ దేవాలయానికి ప్రతినిత్యం 200 నుంచి 250 పక్షవాతం (పెరాలసిస్) భక్తులు వస్తూంటారు. పక్షవాతం (పెరాలసిస్) నుంచి బాధపడుతున్న రోగులు 7 రోజులపాటు ఇక్కడ వుండవలెను. అదేవిధంగా రోజుకు 2 సార్లు దేవునికి హారతిని ఇస్తారు. ఆ హారతి సమయంలో పక్షవాత రోగులు (పెరాలసిస్) ఖచ్చితంగా వుండాలి. అనేక మంది భక్తులు కోలుకున్నఎన్నో నిదర్శనాలు వున్నాయి.

చతుర్ దాస్ జీ మహారాజు మందిరానికి ఎలాంటి ప్రవేశరుసుము లేదు. ఈ దేవాలయానికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తారు.
సమీపంలోని విమానాశ్రయం ఏదంటే అది రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్. ఇక్కడి నుంచి నేరుగా బస్సులు వున్నాయి.ఇక్కడి నుంచి చతుర్ దాస్ జీ మందిరానికి వెళ్ళుటకు సుమారు 5 నుండి 6గంటల కాలం ప్రయాణం చేయవలసివుంటుంది. ఈ మహిమగల దేవాలయాన్ని చేరటానికి సమీప రైల్వేస్టేషన్ బూడాటి మెట్రో రైల్వేస్టేషన్.ఇక్కడినుండి సులభంగా దేవాలయానికి చేరవచ్చును.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)