ప్లాస్టిక్ డబ్బాలలో ఉండే ఆహారం విషంతో సమానం

ప్లాస్టిక్ ఇప్పుడు ప్రపంచానికి ఇది పెను సవాల్.. భూమి తాపం ఎక్కువ అవడంలో ప్లాస్టిక్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది భూమిలో కరగదు.. అలా అని మంటలో వేసి తగలపెడితే పర్యావరణానికి హాని కలిగించే వాయువులు వెలువడుతాయి.. ఈ ప్లాస్టిక్ ని ప్రధానంగా బైస్ఫినాల్ ఏ(బిపిఏ) అనే ప‌దార్థంతో త‌యారు చేస్తారు.

ఇప్పుడు ప్లాస్టిక్ ని అన్ని విషయాలలో వాడేస్తున్నాం.. చివరికి పిల్లలు తినే టిఫిన్.. భోజనం కూడా ప్లాస్టిక్ లో పెట్టి పంపుతున్నాం. ఇది అంత మంచిది కాదు.. వీటివలన అనేక రోగాలు ఉత్పన్నమవుతాయి అంటున్నారు వైద్యులు.. అంతేకాదు వీటిలో ప్లాస్టిక్ కూడా ఒక ర‌క‌మైన విష‌ప‌దార్థ‌మే. అందువల్ల వీటిలో నిల్వ చేసిన ఆహారాన్ని ఆరగించడం వల్ల కిడ్నీల‌ను పాడు చేసే అవ‌కాశం ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు.

ముఖ్యంగా.. ప్లాస్టిక్ కంటెయిన‌ర్లు ప్ర‌ధానంగా బైస్ఫినాల్ ఏ(బిపిఏ) అనే ప‌దార్థంతో త‌యారు చేస్తారట. ముఖ్యంగా అది వేడి వేడిగా ఉండే ప‌దార్ధాల‌తో క‌లిసిన‌ప్పుడు చెమ్మ‌గిల్లిన త‌ర్వాత ద్ర‌వ‌రూపంలో జారిపోతున్న‌ప్పుడు ఆహార‌ప‌దార్థాల‌కు అంటుకుని వాటిపై తేలిపోయే అవ‌కాశం ఉందని వైద్యులు చెప్తున్నారు ఇది ఆరోగ్యానికి హానికరం కూడా.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)