ఆయుర్వేద పద్దతిలో అధిక బరువు తగ్గించుకొనే 15 అద్భుతమైన మార్గాలు

లెమన్ మరియు తేనె అత్యంత ప్రాచుర్యం పొందిన రెమెడీ ఇది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి పరగడుపున తాగాలి. ఈ రెండింటి కాంబినేసన్ డ్రింక్ వల్ల ఆకలి తగ్గుతుంది, శరీరం శుభ్రపడుతుంది. బరువు తగ్గించి. అలాగే వ్యాధినిరోధకత పెంచి వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది.
పెప్పర్ లెమన్, తేనె ఒక మ్యాజిక్ ట్రిక్, బరువు తగ్గించడంలో దీనికి పెప్పర్ జోడిస్తే మరో మ్యాజిక్ జరుగుతుంది. ఈ డ్రింక్ ను ఉదయం మాత్రమే తాగాలని లేదు, రోజులో ఎప్పుడైనా తాగొచ్చు. నిమ్మరసం చలువచేస్తే, పెప్పర్ బాడీ టెంపరేచర్ ను తగ్గించి, ఫ్యాట్ కరిగేలా చేస్తుంది.
క్యాబేజ్ పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. పచ్చిక్యాబేజ్ ను సలాడ్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఎక్కువ పోషకాలను పొందవచ్చు. మరియు ఫ్యాట్ బర్న్ చేయడానికి బూస్ట్ లా పనిచేస్తుంది.

దాల్చిన చెక్క ఆరోమ్యాంటి స్పైసీ. మనం నిత్యం వంటకాల్లో ఉపయోగించే సువాసన భరితమైన చెక్క బరువు తగ్గిస్తుంది. చెక్క శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరీకరించేందుకు బాగా సహాయపడుతుంది. మరియు బరువు తగ్గించడానికి మరియు తీపి పదార్థాలు తినాలనే కోరికను తగ్గిస్తుంది.
కారం, మసాలాలు తగ్గించడం వల్ల జీర్ణ శక్తి తగ్గుతుంది. కారం, చేదు, మరియు ఆస్ట్రిజెంట్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అందుకోసం కడుపులో మంట కలిగించి కొవ్వు కరిగేలా చేసే కొన్ని మసాలాలు, జీలకర్ర, కేయాన్ పెప్పర్, ఆవాలు, పెప్పర్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కాంపౌడ్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, అంతే కాదు బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక వెల్లుల్లి పాయను తినడం వల్ల పది నిముషాల్లో మీ ఆకలి మటుమాయం అవుతుంది.

గ్రీన్ చిల్లీలో ఉండే కెమికల్ కాపసైసిన్ శరీరంలో క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. డైలీ డైట్ లో గ్రీన్ చిల్లీస్ చేర్చడం వల్ల శరీరంలో క్యాలరీలు బర్న్ అవుతాయి. మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఒబేసిటికి మరియు అధిక బరువును తగ్గించడంలో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ అలోవెర. ఇది ఎనర్జీని అందిస్తుంది మరియు శరీరంలో ఉపయోగంలేని ఫ్యాట్స్ ను కరిగిస్తుంది. ఇందులో ఉండే నేచురల్ కొల్లాజెన్ శరీరం మరింత హార్డ్ గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. జీర్ణవాహికలో మరియు కోలన్ లో టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. రెండు అలోవెర లీఫ్స్ తీసుకొని, జెల్ ను స్పూన్ తో ఒక గ్లాసులోకి తీసుకోవాలి. తర్వాత దీన్ని బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేయాలి. దీన్ని సిట్రస్ ఫ్రూట్ జ్యూసులతో కలిపి తీసుకోవచ్చు. నిమ్మరసం, గ్రేప్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ లతో కలిపి తీసుకోవడం వల్ల రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఆయుర్వేదం ప్రకారం బరువు తగ్గించుకోవడానికి కామన్ హెర్బ్ అరటికి, బిబిటిక్, ఆమ్లాకి, లికోరిస్, తులసి, అలోవెర, వ్రిక్షమాల మొదలగు హెర్బ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి క్యాప్స్యూల్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి.
రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది. అల్లం టీని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో వేడి పుట్టి కొవ్వు కరగడానికి సహాయపడుతుంది.
ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే 10 కరివేపాకు ఆకులను తినడం వల్ల ఒబేసిటి దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్ కు కారణమయ్యే ఊబకాయంను తగ్గించడంలో, అధిక బరువు తగ్గించడంలో కరివేపాకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ గా మూడు నెలలపాటు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్స్ యాంటీ ఒబేసిటిగా పనిచేస్తుంది. బాడీ వెయిట్ ను తగ్గిస్తుంది
చాలా మంది ఆయుర్వేద నిపుణుల ప్రకారం రెగ్యులర్ డైట్ లో ఉలవలు చేర్చుకోవడం వల్ల శరీరంలో వేడి పుట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గించే క్రమంలో పూర్తిగా అన్నం మానేయనవసరం లేదు. సాధారణ రైస్ కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్ ను ఒక కప్పును ప్రతి రోజూ తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ లో ఎక్కువ న్యూట్రీషియన్ విలువలున్నాయి.
జీలకర్ర, ధనియాలు, మరియు సోంపు విత్తనాలు అరటీస్పూన్ చొప్పను అన్నీ సమంగా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ వాటర్ లో మిక్స్ చేసి బాగా ఉడికించాలి. మూత పెట్టి పది నిముషాలు బాగా మరిగించాలి. తర్వాత దీన్ని గ్లాసులో పోసుకుని గోరువువెచ్చగా తాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.
రుచి ప్రకారం మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలు ఆరు రుచులుగా వర్గీకరించారు. వాటిలో పులుపు, చేదు, ఉప్పు, స్వీట్ మరియు స్పైసీ. ఈ అన్ని రకాల రుచులను ప్రతి రోజూ రుచిచూడాల్సిందే. జీర్ణవ్యవస్థ సరిగా ఉండాలంటే, వివిధ రకాల ఆహారాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వునిల్వచేరదు, దాంతో బరువు తగ్గుతారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)