ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిన కూతురిని చూసి సంతోషపడ్డాడు కానీ ATM ఎలా వాడాలో నేర్పిస్తూ తండ్రి దగ్గరే 7 లక్షలు కాజేసింది

నాన్నా, ఫేస్ బుక్ కొనుక్కోవాలి పాతిక వేలు పంపించవా అని కొడుకు కాల్ చేసి అడిగితే.. అసలు ఆ బుక్కేంటి, దేనికి అని మారు మాట్లాడకుండా డబ్బులిచ్చే అమాయకపు తండ్రుల గురించి జోక్స్ వేసుకుని నవ్వుకున్నప్పటికీ.. కొన్ని సార్లు బాదగా ఉంటుంది.. అదే తరహాలో ఎటిఎం వాడడం రాని నాన్నని బురిడీ కొట్టించింది ఒక కూతురు.. నాన్నా అంటూ వచ్చింది.. నాన్న దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసుకుని ఉడాయించింది.. చాలా ఏళ్ల తర్వాత కూతుర్ని చూసిన ఆనందం తండ్రిదైతే, తండ్రి దగ్గర ఉన్న డబ్బు కోసమే వచ్చి, ఆ డబ్బు తీసుకుని ఉడాయించిన కూతురు మోసం వెలుగులోకి వచ్చింది.. ఒక పెద్దాయన చెప్పినట్టు మానవ సంభందాలన్ని ఆర్దిక సంభందాలే అని ఇప్పటికీ చాల సార్లు నిరూపితమైంది.. ఇప్పుడు కూడా…

తెలంగాణ ప్రాంతం అశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామానికి చెందిన కొర్సా రాజులు ఒక రైతు. ఇతనికి ఇద్దరు భార్యలుండగా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రెండవ భార్య అయిన వీరమ్మ 23 ఏళ్ళ క్రితమే భర్తతో విడిపోయి వేరే వివాహం చేసుకుంది వీరమ్మ. అప్పటినుండి మొదటి భార్య, కుమార్తెతోనే ఉంటున్నాడు రాజులు. కాగా పోలవరం ప్రాజెక్టు ముంపు లో కుక్కునూరు మండలం దామరచర్ల గ్రామంలోని రాజులుకు రెండెకరాల పొలం ఉంది. నష్టపోతున్న ఆ ప్రాంతం లోనే నివాసముంటున్న వారికి ఆ భూములకు పరిహారంగా 50 లక్షలు వరకు అందుతుంది అని తెలుసుకున్న రాజులు అక్కడికి తన మకాం మార్చాడు. ఈ సంగతిని తెలుసుకున్న రాజులు రెండవ భార్య కుమార్తె అయిన అనిత తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చింది. చాలా సంవత్సరాల తరువాత తన దగ్గరకి వచ్చిన కూతురుని ప్రేమ తో అక్కున చేర్చుకున్నాడు రాజులు. తన పావు ఎకరానికి పరిహారంగా రూ.8.60లక్షలు రాజులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. దీంతో కూతుర్ని తీసుకుని బ్యాంకుకి, ఏటిఎంకి వెళ్లెవాడు. ఎటిఎం వాడడం రాని తండ్రికి అనితే నేర్పింది. దీంతో కూతుర్ని పూర్తిగా నమ్మాడు రాజులు.

ఒక రోజు తన అవసరానికి డబ్బు తీసుకుందామని ఎటిఎం కి వెళ్లిన రాజులు షాక్ కి గురయ్యాడు. తాను వాడుకున్న లక్ష రూపాయలు పోగా మరొక 7.30 లక్షలు ఉండాల్సి ఉండగా బ్యాంకు ఖాతా ఖాళిగా ఉన్నట్టు తెలిపారు బ్యాంకు అధికారులు. దీనితో దిక్కు తోచని పరిస్థితిల్లో రాజులు పోలీసులని ఆశ్రయించాడు. అయితే అనితని విచారించగా తాను ఎటిఎంని కాజేయలేదని తన తండ్రే తనకు కార్డు ఇచ్చినట్లు తెలిపింది. తన అవసరాల కోసం కొంత డబ్బు వాడిన సంగతి నిజమే అయిన మిగతా డబ్బుల గురించి తనకు తెలియదని తెలిపింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)