రాత్రి పడుకునే ముందు ముఖం కడుగుకుంటే మీ ముఖం ఎంతో కాంతివంతంగా సౌందర్యంగా ఉంటుంది

పొద్దంతా ఎక్కడెక్కడో తిరిగిన శరీరం ఇంటికి రాగానే అలసట తీర్చుకుంటుంది. అలాగే ఎక్కడెక్కడో తిరిగి అలసిన చర్మం అలసట తీరాలంటే ? దానిపై చేరిన జిడ్డు పోవాలంటే రాత్రి పడుకునే ముందు కడగాల్సిందే అంటున్నారు డెర్మటాలజిస్టులు! అస్సలు దుమ్ముధూళి లేని ఎంత మంచి వాతావరణంలో సాయంత్రాలు స్పెండ్‌ చేసినా కచ్చితంగా ముఖంపై జిడ్డు చేరుతుంది. ఇంకా రోజంతా మేకప్‌ వేసుకునో, లేదంటే ఏదైనా క్రీమ్‌ వేసుకునో ముఖం పై ఉన్న చర్మ రంధ్రాలన్నీ మూసుకునిపోయి ఉంటాయి ఇవన్నీ పోవాలంటే కచ్చితంగా ముఖం కడగాల్సిందే !

మన దేశంలోని ఏ నగరంలో అయినా దుమ్ము, ధూళి, పొల్యూషన్‌ ఎక్కువే. అందుకే మీ చర్మం కచ్చితంగా పాడైపోతుంది. కాబట్టి మంచి ఎక్స్‌ఫోలియేషన్‌ అవసరం. మంచి ఫేస్‌వాష్‌తో ముఖం కడుగుకుంటే మృతకణాలు తొలగిపోయి ముఖం మంచి కాంతిని సంతరించుకుంటుంది.
రోజంతా అలసిపోయి సాయంత్రానికి ఏ జిమ్‌లోనో, స్విమ్మింగ్‌ పూల్‌లోనో సేదతీరి వస్తూ ఉంటారు. ఆ స్విమ్మింగ్‌పూల్‌లో, జిమ్‌లో గంటలపాటు ఉండటం వల్ల కూడా మీ ముఖంపై బ్యాక్టీరియా చేరుతుంది. సో ఇంటికి వచ్చిన తరువాత ముఖం కడుక్కోకపోతే బ్యాక్టీరియా మీ ముఖాన్ని పాడుచేస్తుంది. ఆ బ్యాక్టీరియాను చంపాలంటే ముఖం కడగాల్సిందే!
సాయంత్రం ముఖం కడుగుతుంటే ముఖాన్ని అలా కాసేపు రుద్దాలనిపిస్తుంది. ఆ తరువాత మాయిశ్చరైజ్‌ అప్లై చేస్తాం. ఇలా ప్రతి రోజూ సాయంత్రం ఓ పదినిమిషాలు ముఖానికి కేటాయిస్తే గంటలు గంటలు పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు !
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)