సినిమాల్లోకి రాకముందే సొంత కంపెనీలు 400 కోట్ల ఆస్థి బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ గురించి ఆసక్తికర విషయాలు

Loading...
వీళ్లు సెలబ్రిటీలా అని అన్నవాళ్లని అవును వీళ్లు సెలబ్రిటీలే అంటూ నిరూపించింది బిగ్ బాస్.. ఈ ప్రోగ్రాంతో విన్నర్ కాకపోయినా బెనిఫిట్ పొందిన వారు హరితేజ, ఆదర్శ్ అయితే విన్నర్ అయి ఓవర్ నైట్ స్టార్ అయింది శివబాలాజీ. జన్మత తమిళుడైనప్పటికీ తెలుగు నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.. నటుడు కాకముందే శివబాలాజీ వ్యాపారస్తుడు. బిగ్ బాస్ విన్నర్ కాకముందే కోటీశ్వరుడు. శివబాలాజీ గురించి కొన్ని విషయాలు మీకోసం.

శివబాలాజీ అక్టోబరు 14, 1980లో తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త మనోహర రామిస్వామి, శివకుమారి దంపతులకు నలుగురి సంతానంలో ఒకడు. శివబాలాజీకి చెల్లెలు గాయత్రి, తమ్ముళ్ళు ప్రశాంత్ బాలాజీ, కృష్ణ సాయి ఉన్నారు. శివబాలాజీ 17 ఏళ్ళ వయసు నుంచే తనతండ్రి నుంచి సంక్రమించిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టి, 20 ఏళ్లకే తన సొంత కంపెనీలు స్థాపించాడు. అయితే తనకి నటనపై ఎనలేని ప్రేమ.. అందుకే ఇంట్లో ఎదురించి మరీ సినీ ఇండస్ట్రీకి వచ్చారు. ఆ సమయంలో తండ్రి కొద్దిరోజులు మాట్లాడడం కూడా మానేశారు. అయినా పట్టుదలతో శివ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి రాకముందే వారి ఆస్తిపాస్తులు మూడు నాలుగు వందల కోట్ల వరకు ఉంటుందట.

2002 లో వచ్చిన ఇది అశోక్ గాడి లవ్ స్టోరి అనే సినిమా తో హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో సక్సస్ రాలేదు. దీంతో చేసేది లేక ఆర్య సినిమాలో నెగటివ్ రోల్ పోషించి టాలివుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత సంక్రాంతి అనే సినిమాలో వెంకటేష్, శ్రీకాంత్ లకు తమ్ముడిగా నటించాడు. తెలుగుతో పాటుగా తమిళ చిత్రాల్లోనూ నటించాడు. 2009లో తన స్నేహితురాలు, సహనటి అయిన మధుమిత ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు.. ఓ రియాల్టీ షో టైటిల్ విన్నర్ వరకు ఇదీ శివబాలాజీ జర్నీ.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...