12 - 14 ఏళ్ల అమ్మాయిలకే డిమాండ్ . ఎంత తక్కువ వయసుంటే అంత రేట్. శోభనం కోసం పాతబస్తీలోనే గెస్ట్‌ హౌజ్‌లు

‘‘నన్ను పెళ్లాడిన షేక్‌కు ఆరోగ్యం బాగోలేదు. అయినా తన కోరికను తీర్చుకునేందుకు మందులు వాడి పశువులా ప్రవర్తించాడు’’
‘‘ఏడేళ్ల క్రితం ఒమన్‌కు చెందిన వృద్ధుడు నన్ను పెళ్లి చేసుకుని 
ఓ హోటల్‌ గదిలో ఉంచి
 20 రోజులు శారీరకంగా అనుభవించి నరకం చూపించాడు. తర్వాత వీసా పంపిస్తానని వెళ్లిన అతని ఆచూకీ లేదు’’ - ఇటువంటి బాధాకరమైన మాటలు పాతబస్తీలోని ఆడపిల్లల నోటి వెంట వినాల్సివస్తోంది. దళారుల పాపమా అని తల్లి దండ్రులు కూడా 12 - 14 ఏళ్ల వయసులోనే తమ కూతుళ్లకు పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారు. షేక్‌లు పెళ్లిళ్ల కోసం బాలికలనే కోరుకుంటుండడంతో ఎంత తక్కువ వయసుంటే అంత కమీషన్‌ వస్తుందనే కక్కుర్తితో బ్రోకర్లు బరితెగిస్తున్నారు. పేదింటి బాలికలే లక్ష్యంగా వారి ఇళ్లచుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

అక్రమ పెళ్లిళ్లను నిర్ణయించే ఖాజీలు తన ఇంట్లోనే పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. షేక్‌లతో పెళ్లి తర్వాత బాలికల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దేశం కాని దేశంలో నా అనే వారులేక బ్రోకర్లు, ఖాజీలను తిట్టుకుంటూ బతుకువెళ్లదీస్తున్న బాలికలు కొందరైతే.. నిఖా తర్వాత షేక్‌లు 2-3 వారాల సంసారం చేసి తమ దేశానికి చెక్కేస్తుండటంతో ఒంటరిగా మిగిలిపోతున్న బాలికలు ఇంకొందరు. షేక్‌ల శోభనం కోసం పాతబస్తీలో గెస్ట్‌ హౌజ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి ?అమ్మాయిలకు పెళ్లి వయసు రాకున్నా నిఖా జరిపించే అధికారం ఆ ఖాజీలకు ఎక్కడిది? వయసు విషయంలో తప్పుడు పత్రాలు సమర్పిస్తే వారికి పాస్‌ పోర్టులు ఎలా దొరుకుతున్నాయి ? ఎక్కువ వయసు సర్టిఫికేట్‌ ఎలా వస్తోంది ? నిఖా సందర్భంగా ఖాజీ వద్ద వరుడి పేరు, అడ్రస్‌ పాస్‌పోర్టు తదితర వివరాలు రాసేటప్పుడు షేక్‌కు వివాహ అనుమతి ఉందా ? అనేది చెక్‌ చేయకుండా ఖాజీలు పెళ్లిళ్లు ఎలా జరిపిస్తున్నారు ?పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న గెస్ట్‌హౌజ్‌లకు అనుమతి, వాటి నిర్వహణపై పోలీసుల చర్యలేవి ? గతంలో అరెస్టయి, మళ్లీ అరబ్‌ షేక్‌లకు కొమ్ము కాస్తున్న దళారులపై గట్టి చర్యలు ఎక్కడ ? నిఖాలో అక్రమాలు జరుగుతున్నా ఖాజీలపై వక్ఫ్‌బోర్డ్‌ వేటు ఎందుకు వేయడం లేదు ? పెళ్లి తర్వాత విదేశాలకు వెళ్లే మహిళల పేర్లు భర్త పాస్‌పోర్టులో ఎందుకు నమోదు చేయడం లేదు ? కౌన్సెలింగ్‌ను మత పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు ?
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)