ఎయిర్‌టెల్ ప్రజల అధార్ నెంబర్ ల తో పెద్ద స్కాం మొదలుపెట్టింది ఎయిర్టెల్ కస్టమర్లు ఇప్పుడే జాగ్రత్త పడండిఇప్పుడు ఫోన్ కనెక్షన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రతి సర్వీస్ ప్రొవైడర్ తమ పరిధిలోని కస్టమర్లందరికీ మెసేజులు పంపిస్తున్నాడు వెంటనే మీ ఆధార్ కార్డ్ నంబరును వెరిఫై చేయించుకుని, మీ సిమ్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలని చెబుతున్నాడు. ఇది చేయించుకోకపోతే మన కనెక్షన్ గోవిందా. చాలామందికి ఈ నంబర్ ఇచ్చాం, ఈ సిమ్ కేన్సిల్ అయితే ఎట్లా అనుకుని మనం ఏం చేస్తాం వెంటనే ఏ సెల్ ఫోన్ షాపుకో, మనకు సిమ్ ఇచ్చిన కంపెనీ వాడి ఆఫీసుకో ఆధార్ కార్డు తీసుకుని పరుగులు తీస్తాం తీస్తున్నాం అక్కడ కార్డు నంబరు చూసి, మన వేలి ముద్ర తీసుకుంటాడు ఆధార్ డేటాలోని వేలిముద్ర, ఇదీ మ్యాచయితే వోకే అదీ ఆధార్‌తో అనుసంధానం అయ్యే తీరు. ఇక్కడే ఎయిర్‌టెల్ వాడు ఓ స్కామ్ వంటి అక్రమానికి పాల్పడుతున్నాడు మనమేమో సిమ్ కార్డు కంటిన్యుటీ కోసం ఆధార్ వివరాలు ఇస్తున్నాం కదా వాడేమో ఏకంగా మన పేరిట బ్యాంకు ఖాతాలే తెరిచేస్తున్నాడు అంతేకాదు, మన గ్యాస్ సబ్సిడీ కూడా ఆ ఖాతాల్లోకి మళ్లిస్తున్నాడు.

మనకు తెలియకుండానే మన పేరిట బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి, మన గ్యాస్ సబ్సిడీ మళ్లించేసుకుంటున్నాడంటే రాను రాను ఇంకేం చేస్తాడో అని ఆందోళన. జస్ట్, ఆధార్‌తో సిమ్ కార్డును అనుసంధానించిన పాపానికి, ఆ వివరాలతోనే బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసేస్తున్నారు. మరి కనీసం కస్టమర్ అభ్యర్థన గానీ, సమ్మతి గానీ లేకుండా ఆ ఆధార్ వివరాలను ఇలా దుర్వినియోగం చేస్తే అది నేరం కాదా ? మోసం కాదా ? పైగా కస్టమర్ నిర్ణయంతో సంబంధం లేకుండా గ్యాస్ సబ్సిడీ ఎలా మళ్లిస్తారు ? ఆల్‌రెడీ కస్టమర్లు తమ ఇతర బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్లను అనుసంధానించి, తమ గ్యాస్ డీలర్ల దగ్గర కూడా ఆధార్ వివరాలు ఇచ్చారు ఆ ఖాతాల్లోకే సబ్సిడీ వచ్చి చేరుతుంది వాటి బదులు ఈ ఎయిర్‌టెల్ ఖాతాల్లోకి మళ్లించేలా సదరు గ్యాస్ పంపిణీ సంస్థలు ఎలా అంగీకరిస్తున్నాయి అనేది ఇప్పుడు అన్నిటినికంటే పెద్ద ప్రశ్న?

నిజానికి ఈ ఎయిర్‌టెల్ బ్యాంకులు రెగ్యులర్ బ్యాంకులేమీ కాదు పేమెంట్స్ బ్యాంకులు చాలా పరిమితమైన బ్యాంకింగు సేవలకు మాత్రమే చాన్స్ ఉంటుంది. ఇలా అత్యంత ఉదారంగా బ్యాంకు ఖాతాలు తెరిచేస్తున్న తీరుపై ఆధార్ కార్డుల జారీ సంస్థ (UIDAI) రుసరుసలాడుతున్నది. భారతీ ఎయిర్‌టెల్‌కు, ఎయిర్‌టెల్ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. ఎయిర్‌టెల్ ఇలా ఆధార్ డేటాను దుర్వినియోగం చేస్తున్నట్టేననీ, పైగా కస్టమర్ ఒక అవసరం కోసం ఆధార్ అనుసంధానం చేస్తే, మరో అవసరం కోసం దాన్ని వాడేయటం, అదీ కస్టమర్‌కు చెప్పకపోవడం నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్టేననీ ఈ సంస్థ ఆరోపిస్తున్నది. వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోవాలనీ, ఏమేం చర్యలు తీసుకున్నారో తమకు చెప్పాలని సంస్థ ఆ నోటీసుల్లో పేర్కొన్నది. ఎకనమిక్ టైమ్స్ ఈ విషయంపై ఎయిర్‌టెల్ బాధ్యుల్ని సంప్రదిస్తే… ‘అబ్బే, మేం కస్టమర్ల అనుమతితోనే నిబంధనల మేరకు మాత్రమే కొత్త ఖాతాల్ని ఓపెన్ చేస్తున్నాం’ అని సంస్థ పీఆర్ డివిజన్ బదులిచ్చిందట. అయితే ఇది పచ్చి అబద్ధం ఆధార్ డేటా అంగట్లో సరుకుగా మారిపోయింది. ఎవరి అవసరాల మేరకు వాళ్లు వాడేసుకుంటున్నారు. ఎయిర్టెల్ కూడా ఇలాగె వాడేసుకుంటుంది ఇంకా మనకు అర్థం కాని పెద్ద గోల్‌మాల్ ఏదైనా ప్లాన్ చేసిందా..? చూడాలి మరి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)