పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చారు.. సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు

అభరు దివారే... ఇటీవలే ఇండియన్‌ రెవిన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌)కి ఎంపికయ్యాడు. నాగ్‌పూర్‌ బేస్‌డ్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(ఎన్‌ఏడీటీ)లో ట్రైనింగ్‌కు వెళ్లనున్నాడు. ప్రీతి కుంభారే... ఐడీబీఐ ముంబై బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నది. ఇద్దరూ UPSC, MPSC పరీక్షల కోసం సన్నద్ధమవుతుండగా పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.

ఇద్దరూ అమరావతిలోని అభియంత భవన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిలో బాజాభజంత్రీలు లేవు. హంగులు, ఆర్భాటాలు అసలే లేవు. చాలా సాదాసీదాగా.. ఒక్కటయ్యారు. అయితే పెళ్లికయ్యే ఆ ఖర్చునే మరో విధంగా ఉపయోగించాలనుకుంది ఆ జంట. ఆత్మహత్యలు చేసుకున్న పది రైతు కుటుంబాలను ఎంచుకుని ఒక్కో కుటుంబానికి 20 వేల చొప్పున డొనేట్‌ చేశారు. 

అంతేకాదు, 52వేల విలువ చేసే వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను అమరావతిలోని ఐదు లైబ్రరీలకు ఇచ్చారు. అయితే ఈ డబ్బంతా వాళ్ల తల్లిదండ్రుల దగ్గరనుంచి తీసుకోలేదు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కష్టపడి సంపాదించిన సొమ్మునే ఇలా వివిధ పనులకు ఉపయోగించారు. విందులో కూడా చపాతి, అన్నం, పప్పు, కూరగాయలు మాత్రమే వడ్డించారు. సింపుల్‌గా స్టేజ్‌పై రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరు చేసిన ఈ పనిని దేశప్రజలంతా శభాష్ అని మెచ్చుకుంటున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)