పరిచయంలేని వ్యక్తితో తన కోరిక తీర్చే అబ్బాయి కోసం రెడీ రెడీ అంటూ ఉంటుంది

నిజమే… ఓ మిత్రుడు అన్నట్టు… అర్జున్‌రెడ్డి పాత్ర చిత్రణపై కొద్దిరోజులపాటు సోషల్ మీడియా సమర్థనలు, విమర్శలతో దద్దరిల్లిపోయింది… వీడురా ప్రేమికుడు అన్నవాళ్లూ ఉన్నారు… వీడేం ప్రేమికుడు అన్నవాళ్లూ ఉన్నారు… అయితే స్పైడర్ సినిమాలో రకుల్ పాత్ర చిత్రణ తీరు మాత్రం పెద్దగా చర్చలోకి రాలేదు… నిన్న ఆంధ్రజ్యోతి సైటులో, ఒకటీ అరా సైట్లలో దీనిపైనే ఓ వార్త… ఫేస్‌బుక్‌లో అక్కడక్కడా కొన్ని వ్యాఖ్యలు అంతే… నిజానికి తెలుగు సినిమాలే కాదు, మొత్తం భారతీయ సినిమా ప్రపంచం హీరోయిన్లను జస్ట్, ఆటగత్తెలుగా, అందగత్తెలుగా మాత్రమే చూపించటానికి ఇష్టపడుతుంది… ప్రాధాన్య పాత్రలు, కథలో ప్రాధాన్యం వంటివి పక్కన పెట్టేయండి.

చాలా సినిమాల్లో హీరోయిన్లు కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం అవుతున్నారు… అఫ్ కోర్స్ కొన్ని సినిమాలు మినహాయింపు..! మరీ మన దక్షిణాది సినిమాల్లో అయితే ఈ పోకడ మరీ ఎక్కువ… హీరోయిన్లు ఉండాలి కాబట్టి ఉండాలి, హీరోతో ఆడాలి, పాడాలి, చిట్టిపొట్టి దుస్తులతో తెరపై అందాలు చిందించాలి… హీరోలు వెంటబడి వేధిస్తే, వాడినే ప్రేమించాలి… మీద పడిపోవాలి… డేన్సులు అనబడే పిచ్చి గెంతులకు సిద్ధమైపోవాలి… ఆ హీరో ఈ హీరో అని ఏమీలేదు… ఆ దర్శకుడు ఈ దర్శకుడు అని కూడా లేదు… చివరకు మన మురుగదాస్ అయితే మరీ మరీ ముందుకు వెళ్లిపోయాడు…

బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన రోజుల్లో తెలుగులో పెద్దగా వివాదం కాలేదు కానీ హిందీ ప్రేక్షకులు తమన్నా, ప్రభాస్ రొమాన్స్‌ను తీవ్రంగా తప్పుపట్టారు… పరుగులు పెట్టిస్తూ, ఒక్కో వస్త్రం వదిలివేయిస్తూ, చివరకు రేప్ చేసినంత పనిచేశాడు అంటూ ఆడిపోసుకున్నారు… మరి స్పైడర్‌లో రకుల్ పాత్ర..? రకుల్ ఈరోజు సాధారణ స్థాయి హీరోయిన్ ఏమీ కాదు… టాప్ హీరోయిన్లలో ఒకరు… తమిళ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ తెలుగు ఇండస్ట్రీలో దుమ్మురేపుతున్న హీరోయిన్… అంటే డిమాండ్‌లో, సంపాదనలో, అవకాశాల్లో…! అయితే ఈ స్టార్‌డమ్ కాపాడుకోవాలంటే ఈ స్థితిలోనే జాగ్రత్తగా ఉండాలి… సరే, అదే ఆమె అదృష్టాన్ని బట్టి ఉంటుందీ అనుకుందాం… కానీ స్పైడర్ సినిమాలో ఆమె పాత్ర ఏమిటి..? మెడిసిన్ స్టూడెంట్… ఎప్పుడూ పోర్న్ వీడియోలు చూస్తూ ఉంటుంది… ఈరోజుల్లో అలాంటి వీడియోస్ చూడడం తప్పులేదు అనుకుంటున్నారు అనుకుందాం కాసేపు… తన కోరిక తీర్చే అబ్బాయి కోసం బ్లైండ్ డేటింగుకూ రెడీ రెడీ అంటూ ఉంటుంది స్నేహితురాలితో.

పెళ్లికి ముందే సెక్స్ కోసం బాగా వెంపర్లాడే పాత్ర… పెళ్లికి ముందే సెక్స్ అనేది కూడా ఈరోజుల్లో తప్పు కాకపోవచ్చు… కానీ మరీ పోర్న్ వీడియోలు చూస్తూ, ఎవరు దొరుకుతారా బాబూ అని కోరికతో రగిలిపోయే పాత్ర… కథలో మహేష్ పాత్రతో ఈ పాత్రకు సాన్నిహిత్యం పెరిగాక… మా ఫ్రెండ్ ఇంట్లో ఎవరూ లేరు, తాళం తీసుకున్నాను, వచ్చెయ్ అంటుంది… సరే, అదీ పెద్ద తప్పు కాదు అనుకుందాం ఈరోజుల్లో… విలన్ విధ్వంసం స‌ృష్టించబోతున్న హాస్పిటల్ గురించి చెప్పటానికి రకుల్ కాల్ చేసినప్పుడూ మహేష్ ‘ఇప్పుడు కూడా అందుకే చేస్తున్నావా’ అంటాడు… అంటే ఆమె పాత్ర చిత్రణ అలా ఉంది… పోనీ, సినిమాలో ఏమైనా ప్రాధాన్యం ఉందా..? ఇంకేమీ ఉండదు… బాబూ… మురుగదాస్… నువ్వు ఒకప్పటి మురుగదాస్ కాదు… ఒక గజినిలో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది..? వావ్… కానీ నువ్వూ ఇలా మారిపోయావ్… ఎందుకిలా కూరుకుపోయావ్…? మురుగా… మురుగా… !!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)